భారత్ కరోనా అప్డేట్
- April 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా రోజువారి కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3,303 నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,68,799కు చేరింది. ఇందులో మొత్తం 4,25,28,126 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో 39 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,23,693కి పెరిగింది. దేశవ్యాప్తంగా 2563 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో 16,980 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,88,40,75,453 మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







