ప్లేస్టోర్‌లో తాలిబన్ యాప్
- April 05, 2016
ఉగ్రవాద వ్యాప్తి కోసం ఐఎస్‌ఐఎస్ సోషల్‌మీడియా, ఇంటర్నెట్‌ను బాగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. కొత్తగా తాలిబన్లూ దీనినే అనుసరించి న్యూస్ వెబ్‌సైట్ పేరుతో ఓ యాప్ రూపొందించి ప్లేస్టోర్‌లో పెట్టారు. ఉగ్రవాద వ్యతిరేక సంస్థ ఒకటి దీన్ని గుర్తించి చెప్పడంతో గూగుల్ ఆ యాప్ తొలగించింది.
ఉగ్రవాదం, దూషణ, హింస గురించి ఆడియో, వీడియో రూపంలో ప్రచారం చేసేందుకు, తమ ప్రధాన వెబ్‌సైట్‌కు సందర్శకులను పెంచుకొనే లక్ష్యంతో తాలిబన్లు 'పాస్తో అఫ్గాన్ న్యూస్-అలెమర' అనే యాప్ రూపొందించారు.
ఇది ఏప్రిల్ 1, 2016 నుంచి ప్లేస్టోర్‌లో అప్‌లోడైంది. ఉగ్రవాదుల ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా పెట్టే 'సైట్' అనే సంస్థ మొదట దీనిని గుర్తించి గూగుల్‌కు చెప్పడంతో యాప్ అప్‌లోడైన రెండు రోజుల్లో తొలగించింది. వర్గం, జాతి, వైకల్యం, జెండర్, శృంగారం, హింస తదితర విషయాలపై రూపొందించే యాప్‌లను ఆమోదింకపోవడం గూగుల్ విధానం. కొన్ని కారణాల వల్ల ఉగ్రవాద యాప్ ప్లేస్టోర్‌లో అప్‌లోడ్ అయిందని సంస్థ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







