జీసీసీ నేషనల్ ఐడీపై సస్పెన్షన్ ను ఎత్తేసిన సౌదీ
- April 29, 2022
రియాద్: జీసీసీ జాతీయ గుర్తింపు ఐడీ కార్డుపై ఉన్న సస్పెన్షన్ ను సౌదీ అరేబియా ఎత్తివేసింది. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజాత్) ప్రకటించింది. సౌదీ పౌరులు, ఇతర గల్ఫ్ సహకార దేశాలకు చెందిన పౌరులు సౌదీ అరేబియాకు, బయటికి ప్రయాణించడానికి జీసీసీ జాతీయ గుర్తింపు ఐడీ కార్డు చెల్లుబాటు అయ్యే పత్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. సౌదీ పౌరులు జాతీయ గుర్తింపు కార్డును ఉపయోగించి జిసిసి దేశాలకు వెళ్లవచ్చని జవాజత్ తెలిపింది. ఫిబ్రవరి 2020లో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణించడానికి జాతీయ ID కార్డులను ఉపయోగించడాన్ని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిలిపివేసింది. ఆ కాలంలో జీసీసీ రాష్ట్రాల్లోని గల్ఫ్ పౌరుల ప్రయాణానికి పాస్‌పోర్ట్ చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రంగా పరిగణనలోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







