ఘనంగా ఇఫ్తార్‌ విందు

- April 30, 2022 , by Maagulf
ఘనంగా ఇఫ్తార్‌ విందు

దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని27 April 2022న దుబాయ్ లోని వెస్ట్ జోన్ హోటల్ అపార్ట్మెంట్స్ నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ కి చెందిన షుమారు 150 (వ్యవస్థాపక, కార్యనిర్వాహక, సబ్ కమిటీ, సభ్యులు) మంది వరకు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు సభ్యులు తమ ప్రసంగాలలో తెలుగు అసోసియేషన్  నిర్వహిస్తున్న కార్యమాల గురించి వివరించారు.పవిత్ర రమదాన్ మాసంలో షుమారు 2,000 వేల మందికి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

యూఏఈ లో నివసిస్తున్న తెలుగు వారందరినీ సమన్వయపరచుకుంటూ "భిన్నత్వంలో ఏకత్వం" అనే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే మరెన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నామని కార్యక్రమంలో తెలిపారు. 

ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు ఉపవాస దీక్ష విరమణాంతర ప్రార్ధనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఇఫ్తార్ కార్యక్రమ నిర్వహణలో తెలుగు అసోసియేషన్ వైస్ చైర్మన్ మసియుద్దీన్ కీలక పాత్ర పోషించారు.అసోసియేషన్ సబ్ కమిటీ సభ్యులైన ఫహీం మరియు జాఫర్ ఆలి సహాయ సహకారములు అందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com