ఉమ్రా యాత్రికులు సామాను నిబంధనలు పాటించండి: మంత్రిత్వ శాఖ

- May 01, 2022 , by Maagulf
ఉమ్రా యాత్రికులు సామాను నిబంధనలు పాటించండి: మంత్రిత్వ శాఖ

జెడ్డా: ఉమ్రా యాత్రికులందరూ బయలుదేరే సమయంలో ప్రయాణ సామాను బరువుల నిబంధనలకు కట్టుబడి ఉండాలని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ యాత్రికులకు పిలుపునిచ్చింది. ప్రయాణించేటప్పుడు అనుమతించబడిన స్పెసిఫికేషన్‌లను నిర్ధారించడానికి, అలాగే పౌర విమానయాన జనరల్ అథారిటీ జారీ చేసిన సూచనలకు కట్టుబడి ఉండటానికి అవసరమైనప్పుడు ఎయిర్‌లైన్ క్యారియర్‌తో కమ్యూనికేట్ కావాలని కోరింది. ఉమ్రా సందర్శకులు వారి విమాన సమయాల ఆధారంగా.. అనుమతించబడిన ప్రయాణ సామాను బరువుల గురించి వారికి అవగాహన కల్పించాలని సౌదీ ఉమ్రా కంపెనీలకు మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ ప్రక్రియ ద్వారా ఉమ్రా యాత్రికులు డిపార్చర్ హాళ్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడంలో దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com