అమల్లోకి వచ్చిన యూఏఈ-భారత్ ‘సీఈపీఏ’ ఒప్పందం

- May 02, 2022 , by Maagulf
అమల్లోకి వచ్చిన యూఏఈ-భారత్ ‘సీఈపీఏ’ ఒప్పందం

యూఏఈ: చారిత్రాత్మకమైన యూఏఈ-భారత్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో దుబాయ్‌కి రత్నాలు, ఆభరణాలతో కూడిన వస్తువులతో కూడి మొదటి కంటైనర్ ఒప్పందంలో భాగంగా బయలుదేరింది. భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం.. దుబాయ్‌కి వెళ్లే మొదటి సరుకుకు ఎటువంటి కస్టమ్స్ సుంకం విధించబడదు. రత్నాలు, ఆభరణాల రంగం యూఏఈకి భారతదేశం సుంకాల రాయితీల నుండి గణనీయంగా ప్రయోజనం పొందగలదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో బి.వి.ఆర్. భారత ప్రభుత్వ వాణిజ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సిరోయా జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఎమరాల్డ్ అనే ముగ్గురు ఎగుమతిదారులకు ఈ మేరకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఫిబ్రవరి 18న భారత ప్రధాని నరేంద్ర మోడీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ తర్వాత భారతదేశం, యూఏఈ  ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా వాణిజ్యం జరుపనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com