జీసీసీ ఐడీలతో ప్రయాణించడానికి అనుమతించిన ఖతార్

- May 04, 2022 , by Maagulf
జీసీసీ ఐడీలతో ప్రయాణించడానికి అనుమతించిన ఖతార్

ఖతార్: జీసీసీ దేశాలు జారీ చేసిన ఐడీలతో ప్రయాణించడానికి ఖతార్ అనుమతించింది.  ఖతారీలు, జీసీసీ దేశాల పౌరులు దేశం, ఇతర జీసీసీ దేశాలకు వెళ్లి వచ్చేందుకు జీసీసీ ఐడీ కార్డులను ఉపయోగించవచ్చని ఖతారీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లే ఖతార్ పౌరులు తాము ప్రయాణించాలనుకుంటున్న దేశాలకు సంబంధించిన ప్రయాణ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ వెసులుబాటు జీసీసీ దేశాల పౌరుల ప్రయాణాలను సులభతరం చేయనుందని పేర్కొంది. ఖతార్ దేశంలోకి ప్రవేశించడానికి రోగనిరోధక శక్తి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న జీసీసీ జాతీయులు,  నివాసితులు, ఈయూ జాతీయులు, నివాసితులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నుండి మినహాయింపును ఇచ్చినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com