జీసీసీ ఐడీలతో ప్రయాణించడానికి అనుమతించిన ఖతార్
- May 04, 2022
ఖతార్: జీసీసీ దేశాలు జారీ చేసిన ఐడీలతో ప్రయాణించడానికి ఖతార్ అనుమతించింది. ఖతారీలు, జీసీసీ దేశాల పౌరులు దేశం, ఇతర జీసీసీ దేశాలకు వెళ్లి వచ్చేందుకు జీసీసీ ఐడీ కార్డులను ఉపయోగించవచ్చని ఖతారీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లే ఖతార్ పౌరులు తాము ప్రయాణించాలనుకుంటున్న దేశాలకు సంబంధించిన ప్రయాణ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ వెసులుబాటు జీసీసీ దేశాల పౌరుల ప్రయాణాలను సులభతరం చేయనుందని పేర్కొంది. ఖతార్ దేశంలోకి ప్రవేశించడానికి రోగనిరోధక శక్తి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న జీసీసీ జాతీయులు, నివాసితులు, ఈయూ జాతీయులు, నివాసితులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నుండి మినహాయింపును ఇచ్చినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







