వర్క్ పర్మిట్ వీసా గడువు పొడిగించిన అమెరికా
- May 04, 2022
అమెరికా: వేలాది మంది భారతీయులకు అమెరికా ప్రభుత్వం ఊరట కల్పించింది. వర్క్ పర్మిట్ వీసా గడువు ముగుస్తున్న కొన్ని క్యాటగిరీల వాళ్లకు ఆటోమెటిక్‌గా పొడిగింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దీంట్లో గ్రీన్‌కార్డు హోల్డర్లతో పాటు హెచ్-1బీ వీసాదారులు భాగస్వాములు కూడా ఉన్నారు. వీళ్లందరికీ మరో ఏడాదిన్నర కాలం పాటు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హోంల్యాండ్ సెక్యూర్టీ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది భారతీయ వలసదారులకు లబ్ధి చేకూర్చనున్నది. 180 రోజుల పొడిగింపును ఆటోమెటిక్‌గా 540 రోజులకు పెంచుతున్నట్లు హోంల్యాండ్ సెక్యూర్టీ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







