డాల్ఫిన్లను పట్టుకున్నందుకు ముగ్గురికి జరిమానా విధించిన బహ్రెయిన్
- May 04, 2022
బహ్రెయిన్: డాల్ఫిన్లను పట్టుకున్నందుకు బహ్రెయిన్ ముగ్గురికి జరిమానా విధించింది. దేశంలోని ప్రాదేశిక జలాల్లో అక్రమంగా డాల్ఫిన్లను పట్టుకున్నందుకు దోషులుగా తేలిన తర్వాత బహ్రెయిన్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి BD1,000 చొప్పున జరిమానా విధించింది. ఈ తీర్పును మేజర్ క్రిమినల్ కోర్ట్ ఆమోదించింది. అలాగే ఫిషింగ్‌లో ఉపయోగించిన పడవను జప్తు చేయాలని ఆదేశించింది. పట్టుబడిన డాల్ఫిన్లను రక్షించడానికి వీలుగా వాటి సహజ ఆవాసాలకు తరలించాలని కొర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రాదేశిక జలాల్లో డాల్ఫిన్లను పట్టుకోవడం బహ్రెయిన్ లో నిషేధం. పర్యావరణం, సహజ సంపదను పరిరక్షించడం అనేది బహ్రెయిన్ రాజ్యాంగంలో ఓ భాగంగా ఉంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







