ఇండిగో కొత్త ఛైర్మన్ గా వెంకటరమణి సుమంత్రన్ నియామకం
- May 05, 2022
న్యూఢిల్లీ: దేశీయ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇండిగో నూతన ఛైర్మన్ గా వెంకటరమణి సుమంత్రన్ నియమితులయ్యారు. ఇండిగో ఎయిర్ లైన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయనను ఛైర్మన్ గా ఎంపిక చేశారు. సుమంత్రన్ 2020 మే 28 నుంచి ఇండిగో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బోర్డ్ గా ఉన్నారు. తాజాగా మాజీ ఛైర్మన్ దామోదరన్ నుంచి ఆయన బాధ్యతలను అందుకున్నారు. 75 ఏళ్లు నిండిన సందర్భంగా ఛైర్మన్ బాధ్యతల నుంచి నిన్న దామోదరన్ వైదొలిగారు.
మరోవైపు కొత్త ఛైర్మన్ గా సుమంత్రన్ ను ఆహ్వానిస్తున్నామని ఇండిగో ఎండీ రాహుల్ భాటియా తెలిపారు. అంతర్జాతీయ సర్వీసులను విస్తరించే క్రమంలో సుమంత్రన్ అనుభవం తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. గ్లోబల్ మార్కెట్లు, అంతర్జాతీయ లావాదేవీలు తదితర అంశాల్లో ఆయనకున్న అనుభవం చాలా గొప్పదని అన్నారు. ఇండిగో సంస్థ సుమంత్రన్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని భరోసా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







