కొత్తగా జన్మించినవారి రెసిడెన్సీ పర్మిట్ ఆలస్యం: రోజుకి 25 దిర్హాముల జరీమానా

- May 05, 2022 , by Maagulf
కొత్తగా జన్మించినవారి రెసిడెన్సీ పర్మిట్ ఆలస్యం: రోజుకి 25 దిర్హాముల జరీమానా

 యూఏఈ:  జన్మించిన 120 రోజుల్లోగా రెసిడెన్సీ పర్మిట్ తీసుకోవాల్సి వుంటుంది. ప్రైవేట్ సెక్టార్ లేదా ఫ్రీ జోన్‌లో పనిచేస్తున్న నివాసితులకు జన్మించిన పిల్లల విషయమై రెసిడెన్సీ పర్మిట్ తీసుకోని పక్షంలో గడువు తీరిన తర్వాత.. అంటే, 120 రోజుల తర్వాత రోజుకి 25 దిర్హాముల జరీమానా విధించడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ పేర్కొంది. యూఏఈఐసీపీ స్మార్ట్ లప్లికేషన్ ద్వారా సంబంధిత డేటాను అప్‌లోడ్ చేయాల్సి వుంటుంది. తగిన ఫీజు చెల్లించాల్సి వుంటుంది. ఒకవేళ అప్లికేషన్ పూర్తి చేయకపోతే 30 రోజుల్లో అది రద్దవుతుంది. సరైన పత్రాలు లేని పక్షంలో అప్లికేషన్ రద్దు చేస్తారు. మొత్తం సర్వీస్ అప్లికేషన్ ధర 250 దిర్హాములు. 100 అప్లికేషన్ రుసుము కాగా, 28 ఎలక్ట్రానిక్ సర్వీస్ రుసుము, 100 జారీ రుసుము, 22 దిర్హాములు అథారిటీ ఫీజు. ఒరిజినల్ స్పాన్సర్డ్ పాస్‌పోర్టు, సేలరీ సర్టిఫికెట్, స్పాన్సర్ పాస్‌పోర్ట్ కాపీ, కలర్ ఫొటో, బర్త్ సర్టిఫికెట్, తల్లి అలాగే తండ్రికి సంబంధించిన రెసిడెన్స్, వర్క్ మరియు లీజ్ కాంట్రాక్ట్ తదితర డాక్యుమెంట్లు తప్పనిసరి. హెల్త్ ఇన్స్యూరెన్స్ కాపీ, తల్లి పాస్‌పోర్టు కూడా అవసరం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com