ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ప్రముఖ భరత నాట్యం నృత్యకారిణి

- May 05, 2022 , by Maagulf
ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ప్రముఖ భరత నాట్యం నృత్యకారిణి

మనామా: ప్రముఖ భారత నాట్యకారిణి ఆశా శరత్, తన అద్భుతమైన నాట్యంతో ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. మలయాళం పోయెటెస్ సుగదకుమారి పోయెమ్ కృష్ణా నీ యెన్నె అరియిల్లాకు డాన్స్ చేశారు ఆశా శరత్. బహ్రెయిన్ కేరళీయ సమాజం వద్ద ఈ ప్రదర్శన జరిగింది. బికెఎస్ ఇండో బహ్రెయిన్ డాన్స్ మరియు మ్యజిక్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ ఆంటిక్యుటీస్, భారత ఎంబసీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉస్తాద్ అమ్జాద్ అలి ఖాన్, ఆయన కుమారులు అమాన్ అలి బగాష్, అయాన్ అల్ బగాష్, ప్రముఖ వీణ కళాకారులు రాజేష్ వైద్య బృందం ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com