భారత పౌరసత్వం వదులుకున్న ఏడున్నర లక్షల మంది పౌరులు
- May 06, 2022
న్యూ ఢిల్లీ: గడిచిన ఆరేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల మంది పౌరులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2016 నుంచి ఏడున్నర లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదులుకోగా, దాదాపు ఆరు వేల మంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 2016-2021 వరకు గణాంకాల ఆధారంగా రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయాల్ని వెల్లడించింది. ఈ డాటా ప్రకారం.. 7,49,765 మంది భారత్ విడిచిపెట్టి, 106 దేశాల్లో స్థిరపడ్డారు.
2019లో అత్యధికంగా 1.44 లక్షల మంది దేశం విడిచిపెట్టారు. 2016లో 1.41 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2020లో మాత్రం చాలా తక్కువ మంది దేశాన్ని వదిలి వెళ్లారు. విదేశాల్లో స్థిరపడ్డ వాళ్లలో దాదాపు 82 శాతం మంది అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకే వెళ్లారు. 2016-2021 మధ్యకాలంలో 2,174 మంది చైనాకు వలస వెళ్లారు. 2020-21లలో 31 మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని పాకిస్తాన్‌కు వలస వెళ్లారు.ఇక, భారత పౌరసత్వం పొందిన వాళ్లలో హిందువులతోపాటు, జైనులు, సిక్కులు, క్రిస్టియన్లు ఉన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







