శాండల్‌వుడ్ నటుడు మోహన్ జునేజా కన్నుమూత..
- May 07, 2022
బెంగళూరు: శాండల్‌వుడ్ నటుడు మోహన్ జునేజా ఇక లేరు.. ఇటీవల KGFచాప్టర్ 2 లో నటించిన ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు.మోహన్ జునేజా కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో హాస్యనటుడిగా నటించి మెప్పించారు. దాదాపుగా 100 సినిమాల్లో ఆయన నటించారు. మోహన్ జునేజా మృతి పట్ల అభిమానులు మరియు శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మోహన్ జునేజా స్వస్థలం కర్ణాటకలోని తుమకూరు జిల్లా. ఆయన బెంగళూరులోనే విద్యాభ్యాసం చేసి అక్కడే స్థిరపడ్డాడు. ఈరోజు ఆయన అంత్యక్రియల జరగనున్నాయి.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







