‘స్కాలర్షిప్’ రీఫండ్ చేయాలని మహిళను ఆదేశించిన కోర్టు
- May 07, 2022
బహ్రెయిన్: ‘స్కాలర్షిప్’ మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఓ మహిళను బహ్రెయిన్ కోర్టు ఆదేశించింది. యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ నుండి యూరప్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం స్కాలర్‌షిప్‌గా పొందిన BD60,000 తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ బహ్రెయిన్ మహిళ దాఖలు చేసిన అప్పీల్‌ను హై అప్పీల్స్ కోర్టు తాజా తిరస్కరించింది. ముందుగా చేసుకన్న ఒప్పందం ప్రకారం.. స్కాలర్షిప్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి తన చదువు పూర్తి అయిన తర్వాత విశ్వవిద్యాలయంలో పని చేయడానికి సదరు మహిళ నిరాకరించింది. దీంతో స్కాలర్ షిప్ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ కోర్టును ఆశ్రయించింది. యూనివర్సిటీలో ఉద్యోగం చేసేందుకు తనకు ఆరోగ్య సమస్యలు అడ్డుపడుతున్నాయని మహిళ న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే, స్కాలర్షిప్ గడువు ముగిసిన రెండేళ్ల తర్వాత ఆమె తన అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ నకిలీ మెడికల్ సర్టిఫికేట్లను సమర్పించిందని విశ్వవిద్యాలయం రుజువు చేయడంతో కోర్టు ఆమె వాదనను తిరస్కరించింది
తాజా వార్తలు
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!







