మైనింగ్ రంగంలో $32 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించిన సౌదీ
- May 07, 2022
రియాద్: మైనింగ్ రంగంలో $32 బిలియన్ల పెట్టుబడులను సౌదీ అరేబియా ఆకర్షించింది. తొమ్మిది కొత్త ప్రాజెక్టుల ద్వారా మైనింగ్, ఖనిజాల రంగానికి 32 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం మంత్రిత్వ శాఖ లక్ష్యం అని సౌదీ పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్ఖోరాయేఫ్ తెలిపారు. విదేశీ కంపెనీల నుండి ఖనిజ అన్వేషణ లైసెన్సుల కోసం ప్రస్తుతం వచ్చిన 145 దరఖాస్తులను మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోందని అల్ఖోరాయెఫ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల 14,500 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. విజన్ 2030 ప్లాన్‌లో భాగంగా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టడం ద్వారా కింగ్‌డమ్ తన ఆర్థిక వ్యవస్థను చమురేతర రంగాలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







