ఆందోళన
- May 07, 2022
ప్రపంచంలో ఒక పక్క యుద్ధం జరుగుతోంది,ఇంకో పక్క రెండు సంవత్సరాల క్రిందట మొదలైన కరోనా వైరస్ తగ్గనేలేదు,తల్లితండ్రుల నుండి దూరంగా ఉంటూ వాళ్ళని మిస్ అవుతున్నామని బాధ,ఉద్యోగం ఉంటుందో లేదో అని బాధ, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందో లేదో అని బెంగ,పిల్లలు సరిగ్గా చదువుతున్నారో లేదో అని బెంగ.
ఇన్ని విషయాలు మన చుట్టూ ఉన్నప్పుడు ఆందోళన కలగటం సర్వ సాధారణం .
మరి ఇన్ని జరుగుతున్నా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం కుదురుతుందా?
ఏ మనిషికైనా ఎల్లప్పుడూ ఆనందం గా ఉండటం కుదరదు.అలా అని నిరాశలోను ఉండిపోకూడదు.అలాంటి మధ్యస్థ స్థితి ఒకటి ఉంటుందా? ఉంటే అది చేరుకోవటం ఎలా?
దానికి కావల్సినది ముఖ్యంగా
1. మనం మార్చ లేని మరియు మన చేతుల్లో లేని విషయాలు ఏమిటి అని తెలుసుకోవటం మరియు అటువంటి వాటిని అంగీకరించటం.
2. మనం మార్చగలిగే శక్తి ఉన్న వాటిని ధైర్యంగా చెయ్యటం.
3. ఈ రెండిటి మధ్య తేడా ని వివేకం తో చూడగలగడం.
ఉదాహరణ:
ప్రపంచలో దేశాలు యుద్ధం చేసుకుంటుంటే మనం ఆందోళన పడకుండా ఉండాలంటే వార్తలు తక్కువ వినడం చేస్తే చాలు అంతకంటే మనం చెయ్య గలిగినది ఏమీ లేదు అని తెలుసుకోవాలి.
కరోనా రాకుండా ఉండాలంటే మనం చెయ్యవలసినవి వాక్సిన్ వేసుకోవటం, మాస్క్ పెట్టుకోవటం,రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరగకుండా ఉండటం లాంటివి మనం చేతుల్లో ఉన్న వాటిని చెయ్యగలగాలి.
ఉద్యోగ విషయంలో కూడా మన కృషి లోపం లేకుండా పని చెయ్యాలి.
పిల్లల చదువు లేదా భవిష్యత్తు కోసం మన వంతుగా మనమేమి చెయ్యగలం అన్నది మనం 100 % చెయ్యగలిగితే .
ఇంక ఆందోళన లేకుండా దేనినైనా ధైర్యంగా ఎదుర్కోగలం.
--ఉమాదేవి వాడ్రేవు
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి