మాస ఫలాలు

- April 06, 2016 , by Maagulf

                                               

 'చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ' 

ప్రపంచంలోనే మొదటి సారి పంచాంగం ఇంగ్లీష్ లో పండిట్ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు ప్రచురించారు. ప్రస్తుతం దుబాయ్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. మరిన్ని వివరాల కొరకు www.chilakamarthi.com లింక్ ని క్లిక్ చెయ్యండి. మరియు జ్యోతిష్యం,వాస్తు కొరకు 0559055357 కి కాల్ చెయ్యగలరు.

 

Worlds first english panchangam writer pandit chilakamarthi prabhakar chakravarthy sarma is available in dubai.

you can know more details about pandit ji on www.chilakamarthi.com

for personal astrology and vaastu consultancy call chilakamarthi on 971559055357.(Dubai)

 

 

మాస ఫలాలు

మే

 

మేష రాశి:  ప్రమోషన్లు అందుకోగల అవకాశాలు మెండుగా ఉంటాయి. నూతన ప్రయోగాలు జయప్రదముగా సాగుతాయి. అవసరానికి తగిన డబ్బులు వచ్చే సూచనలున్నాయి. శారీరక శ్రమవల్ల అశాంతి కలుగవచ్చు.

వృషభ రాశి: ఆదాయం కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించవలెను. భందువల ఇళ్ళలో జరిగే కార్యాలలో పాల్గొని గడుపుతారు.

మిధున రాశి: ఆహార విషయంగా సమస్యలు తలెత్తవచ్చును. విందులకు దూరంగా ఉండాలి. కవులు, కళాకారులకు గుర్తింపు ఉంటుంది. పోలీస్ నిఘా వర్గమువారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కర్కాటక రాశి: అభివృద్ధికి తగిన అవకాశాలకు సన్నిహితుల సహకారం అందుతాయి. ఇతరుల విషయాలపట్ల ఉత్సాహం చూపుతారు. విదినిర్వాహణలో చురుకుదనం ప్రదర్శిస్తారు. ఆరోగ్యము నందు జాగ్రత్త అవసరం.

సింహ రాశి: జప, హోమాదులను నిర్వహించి మంచి ఫలితాలు పొందుతారు. ఇతరుల సహకారము లభిస్తుంది. వ్యాపారాలలో మంచి మార్పులు కలుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో సానుకూలపడతాయి.

కన్యా రాశి: భాగస్వామ్య వ్యవహారాలు విజయవంతముగా పూర్తవుతాయి. గతంలో నిలిచిన వివాహ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. శెత్రువర్గము వారితో విభేదాలు ఏర్పడుటకు అవకాశమున్నది.

తులా రాశి: కుటుంబ వ్యక్తుల అవసరాలకు తగిన పనులను చేస్తారు. నూతన పెట్టుబడులు పెడతారు. అధికార ప్రయత్నాలు తగిన విధంగా చేస్తారు.

వృశ్చిక రాశి: వ్యవహారాలు సక్రమంగా నిర్వహించుకోవలసి వచ్చును. లక్ష్య సాధనకోసం కృషిచేయాల్సి వస్తుంది. సంప్రదింపుల ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయటం మేలు.

ధనూ రాశి: విరామం లేకుండా వ్యవహారాలు నిర్వహిస్తారు. కొత్త ఉత్సాహంతో పనులు సాధిస్తారు. భాగస్వాముల సలహాలను పాటించి లబ్దిపొందుతారు. అభివృద్ధికి తగిన బాటలు వేసుకుంటారు.

మకర రాశి: వ్యాపార లావాదేవీలలో విజయాన్ని పొందుతారు. జప హోమాలను నిర్వహించి మంచి ఫలితాన్ని పొందుతారు. రాజకీయ లబ్ధి పొందుతారు.

కుంభ రాశి: అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. అద్భుత శక్తి సామర్ధ్యాలను పొందుతారు. సుభావార్తలు వింటారు.

మీన రాశి: అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. సమాజ సార్యక్రమాల్లో నిమగ్నులవుతారు. పేరు, ప్రతిష్టల కోసం గొప్పదనాన్ని చాటుకుంటారు.

 

జూన్

 

మేష రాశి:  ఉన్నత పదవులు, బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రాంత ప్రయాణాలు అనుకూలంగా సాగి తృప్తినిస్తుంది. ఆదాయం లభించి పనులు సులువుగా పూర్తిచేయగలుగుతారు.

వృషభ రాశి: అపూర్వ దేవాలయాలు సందర్శిస్తారు. విహార యాత్రలకు అవకాశాలు ఉన్నాయి. అందరితో  స్నేహంగా ఉంటూ వ్యాపారాలను పెంచుకుంటారు. గృహమును అవసరాలకు తగిన ధనాన్ని వెచ్చించి మార్పులు చేస్తారు.

మిధున రాశి: సుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుతారు. విద్యార్దులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన విద్యలను అభ్యసిస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు ఆకట్టుకుంటారు.

కర్కాటక రాశి: భాగస్వామ్య వ్యాపారాల ద్వారా ఆదాయం కలుగుతుంది. భార్య సహకారంతో పనులు పూర్తిచేయడం తృప్తినిస్తుంది. సకాలంలో బాకీలు తీరుస్తారు. ఇతరులకు సలహాలు, ప్రోత్సాహం అందించి అభివృద్ధిలో పాలుపంచుకుంటారు.

సింహ రాశి: వ్యాపార లావాదేవీలలో విజయాన్ని పొందుతారు. చేయు వృత్తి రంగాల్లో పురస్కారాలు లభిస్తాయి. క్రొత్త స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతాయి. శిరోవేదన ఎక్కువగా ఉంటుంది.

కన్యా రాశి: తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన స్త్రీ పరిచయాల ద్వారా కుటుంబమున తగాదాలు వస్తాయి.

తులా రాశి: నూతన వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొత్త ఒరవడిని సృష్టిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధను వహించవలసిన అవసరం ఉన్నది.

వృశ్చిక రాశి: ఇబ్బందుల నుండి తప్పించుకోగాలుగుతారు. క్రొత్త పధకాలను ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవిస్తాయి. ఇతరుల సలహాలు పాటించడం మంచిది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి.

ధనూ రాశి: అవసరమైన ధనం చేతికందుతుంది. బందుమిత్రుల కలయిక వల్ల కొన్ని పనులు పూర్తవుతాయి. మధ్యవర్తిత్వం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సివచ్చును.

మకర రాశి: ప్రయత్నం తో ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగచేస్తారు. గృహవస్తువులను సేకరిస్తారు. కొత్త కార్యాలకు రూపకల్పన చేస్తారు.

కుంభ రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గుర్తింపు పొందుతారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండుట మేలు. సహనం తో వ్యవహరించుట అన్ని విధాల మంచిది.

మీన రాశి: పట్టుదలతో కార్యాలను పూర్తిచేస్తారు. ఇంట శుభకార్యాలు జరుగును. రాజకీయంగా పలుకుబడి ఏర్పడుతుంది. సామాజిక వర్గం వారితో సంబంధాలు బలపడతాయి.

 

జులై

 

మేష రాశి:  వాక్చాతుర్యముచే అనేక మందిని ఆకర్షిస్తారు. ఇతరుల సహకారంతో నూతన లక్ష్యాలను సాధించడానికి సమాయుక్తమవుతారు. ఆర్ధిక ఒప్పందాలు సంతృప్తికరంగా నిర్వహిస్తారు.

వృషభ రాశి: నూతన వ్యక్తుల పరిచయాలు పెరగడం వలన ఆర్ధిక వ్యవహారాలు మెరుగుపడి సంతోషంతో ఉంటారు. గతంలో చేసిన అప్పులు తీర్చి సుఖంగా ఉంటారు. ఆస్థి లావాదేవీలలో విజయం సాధిస్తారు.

మిధున రాశి: గతంలో పెండింగులో ఉన్న ఉద్యోగావకాశములు వచ్చును. కుటుంబ పరిస్థితులు ఆహ్లాదకరంగా మారతాయి. ఉన్నతస్థాయి వ్యక్తుల పరిచయాలవల్ల రాణించే అవకాశము ఉంటుంది.

కర్కాటక రాశి: ప్రతికూలంగా ఉన్నా పట్టుదలతో పనిచేసి పనులు పూర్తిచేస్తారు. ఎన్ని పరీక్షలు ఎదురైనా ప్రయత్నం మీద శుభఫలితాలు పొందుతారు. సాధు, సజ్జనులు ఉపదేశాలవల్ల తప్పులను సరిదిద్దుకుంటారు.

సింహ రాశి: ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిన బాకీలు వసూలవుతాయి. నూతన స్త్రీ పరిచయాలు ఏర్పడుతాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్ననూ ఏకాగ్రతతో ఉంటారు.

కన్యా రాశి: ఆత్మీయులతో కలిసి సంతోషముగా గడుపుతారు. గతంలో రావలసిన బ్యాంకు ఋణాలు అందుతాయి. నేత్ర సంబంధ వ్యాధులు వచ్చుటకు అవకాశమున్నది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చును.

తులా రాశి: అభివృద్ధి పనులు చేపడతారు. ఆశించిన ఫలితాలను సాధించుటలో సిద్ధహస్తులవుతారు. సభలు, సమావేశాల్లో పాల్గొని తగిన గౌరవాన్ని అందుకుంటారు.

వృశ్చిక రాశి: అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. దైనందిన కార్యక్రమాలు క్రొత్త పద్దతులను నేర్చుకుంటారు. అవసరాలకు సరిపడా ఆదాయం అందుకోగలుగుతారు.

ధనూ రాశి:  క్రయవిక్రయాలలో లాభంగా ఉంటుంది. కొంత అనిశ్చితిగా ఉన్ననూ దైవప్రేరణచే తొలిగిపోవును. దేవాలయాలు, పుణ్యస్థలాలను సందర్శిస్తారు.

మకర రాశి: వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. జీవితంలో మార్పులు కోరుకుంటారు. మంచి అవకాశాలు లభిస్తాయి.

కుంభ రాశి: నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చర్చలు, సదస్సులలో పాల్గొంటారు.

మీన రాశి: నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  ముఖ్యమైన వ్యక్తుల ద్వారా వ్యాపారములు ప్రారంభము చేయుదురు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు.

 

 

ఆగస్టు

1.    మేష రాశి: వివాదాలు ఉన్నా సామరస్యంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి వస్తు సామాగ్రులు లభ్యమవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

2.    వృషభ రాశి: ఆరోగ్యం మెరుగుపడడానికి వైద్యుల సలహాలను తీసుకుంటారు. ఎలక్ట్రిక్ వస్తువులు, నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇతరులతో పోటీపడి కార్యాలను సాధిస్తారు.

3.    మిధున రాశి: శుభకార్యాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.మానసికాందోళనకు గురవుతారు.కొన్ని కార్యాలు వాయిదా పడతాయి.జప, హోమాలకు సమయము, ధనము వెచ్చించవలసి వచ్చును.

4.    కర్కాటక రాశి: విపరీత శ్రమచేసిన ఇంటి పనులు పూర్తిచేయుదురు.అనుకున్న సమయానికి బాకీలు తీర్చుట కష్టము. రాజకీయ సమావేశాలలో పాల్గొని గుర్తింపు పొందెదరు. అకాల భోజనం ఎక్కువగా ఉంటుంది. సామూహిక కార్యాలలో పాల్గొంటారు.

5.    సింహ రాశి: ఊహించని విధంగా సమస్యల నుండి బయటపడతారు. అపూర్వ దేవతా దర్శనముచే మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని పొందుతారు. దూరప్రాంతాల నుండి విశేష వర్తమానాలు అందుతాయి.

6.    కన్యా రాశి: రావలసిన ధనం చేతికి అందుతుంది.వాస్తుకు అనుకూలంగా గృహమార్పులు చేస్తారు.వాతావరణం మార్పువలన తాపసిక జ్వరము వచ్చును. భార్య ఆరోగ్య విషయాలయందు జాగ్రత్త వహించవలెను.

7.    తులా రాశి: వృత్తి,ఉద్యోగాల్లో వ్యతిరేక సూచనలు గలవు. క్రొత్త ఆదాయమార్గాలను వినియోగించుకుంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

8.    వృశ్చిక రాశి: పనులను సకాలంలో నిర్వహించడం ద్వారా లాభాలను పొందుతారు. బ్యాంకుల ద్వారా ఋణ సదుపాయం పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు.

9.    ధనూ రాశి: క్రొత్త విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. అలంకారాలు, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

10.    మకర రాశి: లాటరీలు తగలడం వలన మనసు ఆనందంగా ఉంటుంది. అకాల భోజనంవల్ల శారీరక భాధాలను అనుభవిస్తారు. అనుకోని కలహాలకు అవకాశముంటుంది.
11.    కుంభ రాశి: మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వినుట ద్వారా ఉత్సాహంతో ఉంటారు. అప్రయత్న కార్యాలకు శ్రీకారం చుడతారు.

12.    మీనరాశి: కుటుంబమున సుఖ, సంతోషాలతో గడుపుతారు. సంతానము ద్వారా సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది.

 

సెప్టెంబరు
1.    మేష రాశి: వాయిదాపడుతున్న పనులు పూర్తిచేస్తారు. భక్తిశ్రద్ధలతో పూజా పునస్కారాలను నిర్వహిస్తారు. వివాదాలు ఏర్పడినా పరిష్కరించుకుంటారు.

2.    వృషభ రాశి: బ్యాంకు లావాదేవీలు, ప్రయాణాలు లాభాలనిస్తాయి. కుటుంబ అవసరాలను గమనించి మసులుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

3.    మిధున రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ విషయంలో పై అధికారుల వలన ఇబ్బందులెదురవుతాయి.

4.    కర్కాటక రాశి: ప్రత్యేక బాధ్యతలు నిర్వహించడం వలన అధికారుల మన్ననలు పొందుతారు. నూతన ప్రయత్నాల ద్వారా వివాహ కార్యములను గృహంలో నిర్వహిస్తారు. గృహావసరాలకు, విందు వినోదాలకై విరివిగా ధనాన్ని వినియోగిస్తారు.

5.    సింహ రాశి: స్పెక్యులేషన్లు లభిస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టుట వలన ఆదాయాన్ని పొందుతారు. పిల్లల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించుట మేలు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశమున్నది.

6.    కన్యా రాశి: క్రిందిస్థాయి వ్యక్తుల వలన తగాదాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. సాంఘిక రాజకీయ వ్యవహారాలలో ముఖ్య భూమికను పోషిస్తారు. గతంలో నిలచిన ప్రమోషన్లు వస్తాయి.

7.    తులా రాశి: ఆదాయం ఆశించినంతగా ఉండకపోవచ్చు. ఇతరుల వ్యవహారాలు జాగ్రత్తగా చక్కబెడతారు. అపూర్వ దేవతా దర్శనముల వలన మానసిక ప్రశాంతతను పొందుతారు.

8.    వృశ్చిక రాశి: కృషికి తగిన ప్రశంసలు, ఫలితాలు అందుకుంటారు. ఆర్థికపరంగా మెరుగైన స్థితిని పొందుతారు. శారీరక శ్రమ పెరగడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. శుభకార్యాలలో పాల్గొని గుర్తింపు పొందుతారు.

9.    ధనూ రాశి: విదేశాల్లోని వారి ద్వారా అభివృద్ధికి తగిన ప్రోత్సాహం అందుతుంది. ఋణవిముక్తులు అవుతారు. ఆదాయం, ఆస్తి లావాదేవీలు సంతోషాన్నిచ్చేవిగా ఉంటాయి.

10.  మకర రాశి: పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసిక ఆనందాన్ని పొందుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తుల ద్వారా వ్యాపార లావాదేవీలు కలసివస్తాయి. 

11.  కుంభ రాశి: ప్రజాసంబంధం కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్త వహించుట మంచిది. ఆరోగ్య విషయాలపట్ల శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ తప్పకపోవచ్చు.

12.  మీనరాశి: మారిన పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలసి దైవిక కార్యక్రమాలకు సమాలోచన చేస్తారు.

 

అక్టోబరు

 

1.మేష రాశి

రాజకీయ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగ, వ్యాపారాలు సక్రమంగా సాగుతాయి. ఆర్థికస్థితి మెరుగవడం వలన ఉత్సాహంతో ఉంటారు. గతంలో నిలిచిన బిల్లులు చెల్లిస్తారు.

 

2.వృషభ రాశి

పట్టుదల వలన సోదరవర్గం నుండి విబేధాలు ఏర్పడతాయి. గతంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యక్తుల పట్ల శ్రద్ధ చూపాల్సి ఉంటుంది.

 

3.మిధున రాశి

అటవీ ప్రాంతముల యందు తిరుగుటవలన వస్తువులు పోగొట్టుకొనుట జరుగును. స్త్రీ సంతానము ద్వారా ధనలాభాన్ని పొందుతారు.

 

4.కర్కాటక రాశి

కార్యదీక్షతో వ్యవహరించి తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు.సామాజిక సంస్థలలో సభ్యత్వం పొంది కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవతానుగ్రహం కలుగుతుంది.ఆరోగ్యమునందు జాగ్రత్త అవసరం.

 

5.సింహ రాశి

నూతన కార్యాలను సాధించుటలో శక్తివంతులై ఉంటారు. ఆశించిన రంగాల్లో అభివృద్ధిని సాధించుతారు. పై అధికారుల వత్తిడి ఉన్ననూ సామరస్యముగా సమస్యలను పరిష్కరించుతారు.

 

6.కన్యా రాశి

పెద్దలను గౌరవించి తగిన సలహాలను పొందుతారు. వాయిదా పడుతున్న కోర్టు కేసులు పరిష్కారమై శాశ్వత ప్రయోజనాన్ని కలిగిస్తాయి. దేవతానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది.

 

7.తులా రాశి

యాగములను నిర్వహిస్తారు. మనోల్లాసముచే జీవనము సాగిస్తారు. విజ్ఞాన వంతమైన విషయాలను సేకరిస్తారు. అనుకూల శుభ వర్తమానాలు అందుతాయి.

 

8.వృశ్చిక రాశి

ఆశ్చర్యకరమైన పరిణామాలు రాజకీయ రంగాల్లో ఏర్పడుతుంది. సరైన ఆలోచనా నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. సోదర, మాతృవర్గం ద్వారా శుభవార్తలు, ఆహ్వానాలు అందుతాయి.

 

9.ధనూ రాశి

వృత్తి ఉద్యోగాల్లో అప్రయత్నంగా అన్ని అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వాస్తు వాహనాలు కొనుగోలుచేసే సూచనలున్నాయి. కుటుంబ సౌఖ్యం మానసిక ప్రశాంతత లభిస్తాయి.

 

10.మకర రాశి

పుణ్యకార్యాలతో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు మిత్రులతో విహారాలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.

 

11.కుంభ రాశి

అపకీర్తి ఏర్పడే సూచనలున్నాయి. అకాల భోజనముచే శారీరిక మార్పులు సంభవిస్తాయి. క్రిమికీటకాలకు దూరంగా ఉండుట మంచిది. దేవతానుగ్రహ ప్రాప్తి.

 

12.మీన రాశి

వ్యాపారంలో విశేషాలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి తదనుగుణంగా ప్రవర్తిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు.

 

నవంబరు

1.    మేష రాశి
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలత ఉంటాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు.

2.    వృషభ రాశి
నూతన స్థాయివారి స్నేహమువలన నూతన పథకాలను అమలు చేస్తారు. ప్రోత్సాహకర పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరప్రాంత శుభవర్తమానాలు అందుకుంటారు.

3.    మిధున రాశి
విద్యార్థులకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. శుభవర్తమానాలు అంది ప్రయాణము చేయవలసివచ్చును. కుటుంబ పరిస్థితుల్లో అనూహ్య మార్పులుంటాయి.

4.    కర్కాటక రాశి 
బాధ్యతలను పంచుకుని ఇతరుల కార్యాలను సాధిస్తారు. రచనలు పత్రికలయందు ప్రచురితమై ధనము,గుర్తింపు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

5.    సింహ రాశి 
ఉద్రేకముగా పనులను సాగించవలసివస్తుంది. వృత్తి రంగాల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈర్ధిక ప్రయోజనాలు నిరుత్సాహ పరుస్తాయి. దూరప్రాంత ప్రయాణాల వలన శారీరక శ్రమ ఉంటుంది.

6.    కన్యా రాశి
స్వశక్తి తో కార్యాలను నిర్వహిస్తారు. దూరప్రాంత మిత్రులవలన మంచి సహకారాన్ని పొంది సుఖపడతారు. అనుకోని సంఘటన జరిగి ప్రజలలో గుర్తింపు పొందుతారు.

7.    తులా రాశి
దీర్ఘకాల  ప్రణాళికలను ప్రారంభిస్తారు. కుటుంబ వ్యక్తులు అన్నివిధాలా సహకరిస్తారు. ఆర్ధిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. దానధర్మాలకు ధనాన్ని వెచ్చిస్తారు.

8.    వృశ్చిక రాశి
బెట్టును పక్కనపెట్టి అన్ని వర్గాల వారితో సంబంధాలను బలపరుచుకొనుట మంచిది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. గృహ సంబంధ వ్యవహారాలు సానుకూలపడతాయి.

9.    ధనూ రాశి
ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి. సొంత విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకొనుట మంచిది.

10.    మకర రాశి
విదేశీయాన ప్రయత్నాలు ముమ్మరంగా సాగించవలసి వస్తుంది. కుటుంబంలో అనుకోకుండా శుభకార్యాలు చేసే అవకాశము ఉంటుంది.

11.    కుంభ రాశి
కళత్రబాధలు అధికమవుతాయి. సమయం ప్రకారం పనులను చేయుటకు ప్రాధాన్యమిస్తారు. వాక్చాపల్యం వలన కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

12.    మీన రాశి
పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. దానధర్మాలు చేయుటయందు ఆసక్తి కలిగి ఉంటారు. గతంలో పోయిన పదవులు తిరిగి పొందుతారు. సంతానాభివృద్ధి కలుగుతుంది.

 

డిసెంబరు
1.    మేష రాశి 
ప్రయాణాలలో శ్రమ కలిగినా ఫలవంతంగానే ఉంటుంది. ఇతరుల ఆశయాలను తెలియజేయడానికి కష్టపడవలసి వస్తుంది. కృషికి తగిన గుర్తింపు, ప్రజాదరణ అందుకుంటారు.

2.    వృషభ రాశి
పెరిగిన ఖర్చులను తగ్గింపు చేసుకుంటారు. విరామం లేకుండా సొంతపనులను పూర్తిచేస్తారు. దూరప్రాంత ప్రయాణాల వలన ఆరోగ్యం మందగిస్తుంది. శత్రు కార్యాలను వాయిదా వేసుకొనుట మంచిది.

3.    మిధున రాశి
నూతన వ్యక్తులను నమ్మి మోసపోకుండా ఉండుట మంచిది. దూరపు బంధువుల రాకవలన కుటుంబమున సంతోష కార్యములు నిర్వహిస్తారు.

4.    కర్కాటక రాశి
అభిరుచులకు తగినవిధంగా పరిస్థితులు నెలకొంటాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తమాన ఆహ్వానాలు అంది శుభకార్యాలలో పాల్గొంటారు. అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

5.    సింహ రాశి
ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకొనవలసి వస్తుంది. ఉదార, మోకాలి సంబంధ వ్యాధుల వలన శస్త్ర చికిత్సలు జరుగుటకు అవకాశమున్నది. పుణ్యకార్యముల యందు పాల్గొంటారు.

6.    కన్యా రాశి
సత్వర పరిష్కారాల కోసం ఇతరులను ఆశ్రయిస్తారు. శ్రమతో ముందుకు సాగుతారు. చేతులకు, కాళ్లకు అగ్నిప్రమాదం సంభవించవచ్చును. ఇతరులను ఆకర్షించే వస్త్రములు కొనుగోలు చేస్తారు.

7.    తులా రాశి
సాగుతున్న విషయాల్లో అభివృద్ధి కనిపించి ఉపశమనం పొందుతారు. శత్రువర్గము వారితో దూరంగా ఉండటం శ్రేయస్కరం. లాభసాటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

8.    వృశ్చిక రాశి
కొత్త వ్యక్తుల పరిచయాల వాళ్ళ వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యల నివారణ కోసం ఔషధసేవనం చేయవలసివచ్చును. కోర్టు సమస్యలను అధిగమించుతారు.

9.    ధనూ రాశి
గృహ నిర్మాణాలు, మార్పిడులు అనుకూలిస్తాయి. కొన్ని విషయాలలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ వ్యక్తులతో కలసి శుభకార్యాలలో పాల్గొంటారు.

10.    మకర రాశి
విరివిగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సున్నితమైన విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండుట మంచిది.

11.    కుంభ రాశి
ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నిటిలో విజయవంతంగా సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. శుభవార్తలు వింటారు.

12.    మీన రాశి
స్త్రీ సంతానమునకు వివాహము చేయుదురు. బంధువుల వలన వస్తువులు పోయే సూచనలున్నాయి. క్రయవిక్రయాలు జోరుగా సాగుతాయి. పండితుల ఆశీస్సులు లభిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com