జాకీచాన్ మైనపు విగ్రహాన్ని సోనూసూద్ ఆవిష్కరించారు
- April 06, 2016
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, నటుడు అయిన జాకీచాన్ మైనపు విగ్రహాన్ని రూపొందించారు. నహర్‌గడ్ కోటలో రూపొందించిన ఈ విగ్రహాన్ని నటుడు సోనూసూద్ ఆవిష్కరించారు. ఈ విషయాన్ని సోనూ తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఫొటో పోస్ట్ చేశాడు. జాకీ, సోనూసూద్‌లు ఇండో-చైనీస్ చిత్రమైన 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జోధ్‌పూర్‌లో జరుగుతోంది. ఇందులో జాకీకి జంటగా బాలీవుడ్ నటి అమైరా దస్తర్ నటిస్తోంది. స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు వచ్చినప్పుడు ఇరు దేశాల మధ్య జరిగిన మూడు చిత్రాల ఒప్పందంలో ఒకటి.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి