నిండు పౌర్ణమి
- May 09, 2022ప్రాణం పోసిన దేవత మరో అపురూపమైన ప్రాణిని
మోసే అమృతకలశం
నిండైన పౌర్ణమి మాధుర్యము పంచే అమృతమూర్తి
మనసు నిండా అమృతము సేదతీరువేళ ఒడిస్వర్గము
అన్నింటా నీవే మా వెంట తోడు నీడ నీవే అమృతవల్లి
అలుపెరగని జీవి ఏ ఫలం ఆశించని నిత్యశ్రామికురాలు
ఆవేదనల భారాన్ని మోస్తు మోములో కొండంత
భరోసా చిరునవ్వుతో ధైర్యాన్ని నింపే సేవామూర్తి
నిరంతరము పిల్లల ఉన్నతికై తపించే జననీ
నిన్ను నిన్నుగా ప్రేమించి అక్కున చేర్చుకొనే తొలి ఒడి
అమ్మ అనే అక్షరము నేర్పిన తొలి బడి
కల్మషంలేని ఏ ఫలం ఆశించని గుడి మాతృహృదయము
నేడు మరో బిడ్డకి తల్లిగా మలిచిన ఆ తల్లి ఋణం
ఏమిచ్చినా తీర్చుకోలేని ఓ అధ్భుత కావ్యం అమ్మ.
మాతృమూర్తులకి అందరికి శుభాకాంక్షలు....
--యామిని కోళ్లూరు,అబుదాభి
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్