ప్రపంచంలో అతి పెద్ద క్రీస్తు విగ్రహం
- May 09, 2022బ్రెజిల్: ప్రపంచంలో అతి పెద్ద క్రీస్తు విగ్రహం బ్రెజిల్‌లోని వరల్డ్ ఫేమస్ సిటీ రియో డి జనీరోలో.. క్రైస్ట్ ది రీడీమర్ విగ్రహం ఏర్పాటు చేసారు. దీని ఎత్తు.. 124 అడుగులు. దీనిని చూసేందుకు.. అక్కడ సెల్ఫీలు తీసుకునేందుకు.. ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వస్తుంటారు. అయితే.. సౌత్ బ్రెజిల్‌లోని సియారా స్టేట్‌లో ఉన్న ఎన్‌కాంటాడో అనే చిన్న పట్టణంలో.. 141 అడుగుల ఎత్తుతో.. మరో క్రీస్తు విగ్రహాన్ని నిర్మించారు.దీనిని.. క్రైస్ట్ ది ప్రొటెక్టర్ అని పిలుస్తున్నారు. దీనికి.. మార్కస్ మారా అనే శిల్పి రూపకల్పన చేశారు.
ఎన్‌కాంటాడోలోని లోకల్ వ్యాపారులు.. విరాళాలు పోగేసి మరీ.. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. 2019లో మొదలైన నిర్మాణం.. గత నెల పూర్తైంది. ఇప్పుడు.. ప్రపంచంలో అతి పెద్ద క్రీస్తు విగ్రహం ఇదేనని.. చెబుతున్నారు. బలమైన లోహ నిర్మాణంపై.. కాంక్రీట్‌తో ఈ స్టాచ్యూని నిర్మించారు. ఓ కొండపై.. దీనిని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి చూస్తే.. ఎన్‌కాంటాడో పట్టణమంతా కనిపిస్తుంది.
ఈ విగ్రహాన్ని బ్రెజిల్ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా.. ఇది వరల్డ్ ఫేమస్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయ్. ఎందుకంటే.. ఈ స్టాచ్యూలో.. హార్ట్ షేప్‌లో భారీ విండో ఉంది. టూరిస్టులు అక్కడికి వెళ్లి వ్యూ చూడొచ్చు. అయితే.. ఇప్పుడే కాదు.. వచ్చే ఏడాది నుంచి దీనిని చూసేందుకు ప్రజలను అనుమతిస్తారు. దీనికి దగ్గర్లోనే.. భారీ టూరిస్ట్ కాంప్లెక్స్ నిర్మించే ప్లాన్ కూడా ఉంది. ప్రస్తుతం.. ఈ కొత్త విగ్రహం వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయ్. ఇది నిర్మాణంలో ఉన్నప్పుడే.. 21 దేశాలకు చెందిన 50 వేల మందికి పైగా దీనిని చూశారు. మున్ముందు.. ఇంకెంతమంది టూరిస్టులు వస్తారన్నది.. ఇప్పుడే అంచనా వేయలేం.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ పిల్స్ సీజ్..!!