నౌకాశ్రయంలో తలదాచుకున్న శ్రీలంక మాజీ ప్రధాని!

- May 10, 2022 , by Maagulf
నౌకాశ్రయంలో తలదాచుకున్న శ్రీలంక మాజీ ప్రధాని!

కొలంబో: శ్రీలంకలో రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రజలు ప్రభుత్వం‍పై తిరగబడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినా లెక్కచేయకుండా దాడులకు దిగారు.ఈ క్రమంలో ప్రభుత్వ మద్దతు దారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణలతో శ్రీలంకలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స పదవుల నుంచి దిగుపోవాలంటూ నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్న ప్రజలు సోమవారం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు.పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి తీవ్రస్థాయిలో నిరసనను వ్యక్తం చేశారు.కొలంబోలో అధ్యక్ష కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com