విశ్వక్సేనుడు ‘అశోక వనం’తో గట్టిగా కొట్టాడుగా.!
- May 10, 2022
అల్లు అర్జున్ సినిమాలో డైలాగ్ వుంటుంది కదా.. క్లాస్‌లో బాగా చదివినోడు కాదు.. ఎగ్జామ్ హాల్‌లో అన్ని ప్రశ్నలకూ బాగా సమాధానం రాసినోడే టాపర్ అవుతాడు..’ అనే డైలాగ్ మాదిరి సినిమాలు చేయడమే కాదు. ఆ సినిమాలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో కూడా తెలిసినోడే అసలు సిసలు హీరో అనిపించుకుంటాడు.
ప్రస్తుతం అలాగే అసలు సిసలు హీరో అనిపించుకుంటున్నాడు యంగ్‌స్టర్ విశ్వక్‌సేన్. అదేనండీ ‘ఫలక్ నుమా దాస్’, ‘పాగల్’ తదితర సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్న నటుడు విశ్వక్ సేన్. కంటెంట్‌తో పని లేకుండా పబ్లిసిటీ స్టంట్‌తోనే మనోడి సినిమాలు ఆడియన్స్ సోదిలో నిలిచాయంటే అతిశయోక్తి కాదేమో.
లేటెస్టుగా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశ్వక్ సేన్. ఈ సినిమా కూడా అంతే, బడ్జెట్‌తో సంబంధం లేకుండా భారీగా వసూళ్లు కలెక్ట్ చేస్తోంది. అందుకు కారణం మనోడి పబ్లిసిటీ స్టంట్ టాలెంటే మరి.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రిలీజ్‌కి ముందు టీవీ 9 జర్నలిస్టు దేవీ నాగవల్లితో విశ్వక్ సేన్ గొడవకు దిగిన ముచ్చట ఈ మధ్య పెద్ద రచ్చయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌కి ఆ గొడవ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. తన గత చిత్రాల విషయంలోనూ ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లే చేశాడు విశ్వక్ సేన్.
లో బడ్జెట్‌లో సినిమాలు చేసేస్తాడు విశ్వక్ సేన్. తనదైన స్టయిల్లో పబ్లిసిటీలు ప్లాన్ చేసుకుంటాడు. ఇంతవరకూ బాగానే వర్కవుట్ అయ్యాయ్. చిన్న సినిమాలే అయినా, పెద్ద విజయాలు అందుకుంటున్నాయ్ మనోడి పబ్లిసిటీ స్టంట్ టాలెంట్ ఏమో కానీ, అన్నిసార్లూ ఈ పబ్లిసిటీ ట్రిక్స్ వర్కువుట్ అవుతాయా.. విశ్వక్ సేనా.? జర ఆలోచించుకో మరి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







