57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
- May 12, 2022
న్యూఢిల్లీ: త్వరలో గడువు ముగియనున్న 57 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా 15 రాష్ట్రాలకు చెందిన ఈ సీట్లకు జూన్ 10న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 24న విడుదల చేయనుంది. నామినేషన్‌కు చివరి గడువు మే 31వ తేదీ. మొత్తం 15 రాష్ట్రాల్లో ఉన్న 57 ఖాళీలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. యూపీలో 11, ఏపీలో 4, రాజస్థాన్ లో 4, చత్తీస్‌ఘడ్ లో 4, జార్ఖండ్ లో 2, మహారాష్ట్రలో 6, తమిళనాడులో 6, పంజాబ్ లో 2, ఉత్తరాఖండ్ లో 2, బీహార్ లో 5, తెలంగాణలో 2, హర్యానాలో రెండు, మధ్యప్రదేశ్‌లో మూడు, ఒడిశాలో3 స్థానాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి లక్ష్మీకాంత రావు, ధర్మపురి శ్రీనివాస్.. జూన్‌లో రిటైర్ కానున్నారు. ఆ ఇద్దరి స్థానాలకు జూన్ 10న ఎన్నికలు ఉంటాయి.
ఇక ఖాళీల వివరాల్లోకెళితే… ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో వైస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి సహా.. బీజేపీ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సురేశ్ ప్రభు, టీజీ వెంకటేశ్‌ల పదవీ కాలం ముగియనుంది. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి. శ్రీనివాస్‌ల పదవీ కాలం ముగియనుంది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకే కొత్తగా ఎన్నికలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







