ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్‌లైన్!
- February 20, 2026
అణు ఒప్పందం అంశంపై ఇరాన్– అమెరికా మధ్య తీవ్ర ఉదిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. వాషింగ్టన్లో జరిగిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ సమావేశం, ఆ తర్వాత విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ విషయంలో తనలో సహనం నశించిందని స్పష్టం చేశారు. ఏదో ఒక ఒప్పందానికి రావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇరాన్‌కు అత్యంత దురదృష్టకరమైన పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. అణు ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడానికి 10 నుంచి 15 రోజుల సమయం గరిష్టంగా సరిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తన అణు మొండితనాన్ని వీడకపోతే, తాము సైనిక చర్య వేయక తప్పదని ఆయన పరోక్షంగా యుద్ధ సంకేతాలు ఇచ్చారు.
“మేము చేపట్టిన అణు నివారణ చర్యలను పూర్తి చేసే మార్గంలో ఇరాన్ మాతో చేతులు కలపాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ వారు మాతో కలిస్తే అది చాలా మంచిది. వారు మాతో కలవకపోయినా అది కూడా మంచిదే. కానీ, ఆ తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. ఒప్పందంపై ఎక్కువ రోజు సాగదీయలేం. ఇరాన్ కచ్చితంగా ఒప్పందానికి రావాలి. ఒకవేళ అలా జరగకపోతే, ఒప్పందం కుదరని పక్షంలో చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు మేము దీనిని మరో మెట్టు ముందుకు తీసుకెళ్లాల్సి రావచ్చు. బహుశా మేము ఒక ఒప్పందానికి రావచ్చు. రాబోయే 10 రోజుల్లో ఒప్పందంపై నిర్ణయం తెలుస్తుంది” అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..







