‘సూపర్’ ఎఫెక్ట్: మహానటి నెక్స్‌ట్ ఏంటీ.?
- May 12, 2022
కీర్తి సురేష్ మంచి నటి. అందుకే మహానటి అనే ట్యాగ్ పుచ్చుకుంది. కానీ, ఎందుకో ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్‌కి ఆ రేంజ్ హిట్టు కొట్టడం చాలా చాలా కష్టమైపోతోంది. దాంతో స్టోరీ సెలెక్షన్స్‌లో కీర్తి సురేష్ తప్పుటడుగులు వేస్తోందా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్ ఆమె అభిమానుల్లో.
ఒకానొక టైమ్‌లో కీర్తి సురేష్‌ని ఐరెన్ లెగ్ అని కూడా అనేశారు. అయినా కానీ అవకాశాలు ఆమెకు క్యూ కడుతూనే వున్నాయ్. అన్నీప్రెస్టీజియస్ ఆఫర్లే. కానీ, అవేమీ కీర్తి సురేష్‌కి హిట్టు టాక్ తెచ్చి పెట్టలేకపోతున్నాయ్. ‘చిన్ని’ అను చిన్న సినిమాతో దక్కించుకున్న ప్రశంసల్లో ఒకింతయినా పెద్ద సినిమాలతో అందుకోలేకపోతుండడం నిజంగా దురదృష్టకరం.
లేటెస్టుగా కీర్తి సురేష్ నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజైంది. సూపర్ స్టార్ సినిమా. ప్రీ రిలీజ్ బజ్ చాలా చాలా బాగుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్ మళ్లీ టాప్ లెవల్ ప్రశంసలు దక్కించుకోవడం ఖాయం అనుకున్నారంతా. కానీ, సీను మళ్లీ రివర్స్ అయ్యింది. ‘సర్కారు వారి పాట’ సినిమా రిజల్ట్ కూడా బోల్తా కొట్టేసింది.
దాంతో కీర్తి సురేష్ తదుపరి ప్రాజెక్టుల పైనా ఈ ఎఫెక్ట్ వుంటుందంటున్నారు సినీ మేథావులు. తదుపరి కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ కాగా, చిరంజీవి చెల్లెలిగా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది కీర్తి సురేష్. కీర్తి సురేష్ లక్కు లిస్టు చూస్తుంటే, మరి ఈ సినిమా భవితవ్యం ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







