బిగ్‌బాస్ కోసం బిందు మాధవి ఎంత ఖర్చు చేసిందో.!
- May 12, 2022
బుల్లితెరపై మెగా రేంజ్ పాపులారిటీ వున్న బిగ్‌బాస్ రియాల్టీ షో ఇప్పుడు బుల్లితెర నుండి ఓటీటీ తెరకు ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఓటీటీలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతో టెలికాస్ట్ అవుతున్న బిగ్‌బాస్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఎలిమెంట్‌గా మారింది.
ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న బిగ్‌బాస్ ఓటీటీకి కంటెస్టెంట్ బిందుమాధవి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. ఈమె పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇంత రచ్చ జరగడానికి బిందు మాధవి ఎంత ఖర్చు చేసిందా.? అనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి.
గతంలో కౌషల్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో బిగ్‌బాస్ రచ్చకు తెర లేచింది. ఆ తర్వాతి సీజన్‌లో అభిజిత్ బాగా ఖర్చు చేసి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. అదే టైమ్‌లో అఖిల్ సార్ధక్ కూడా భారీ బడ్జెట్ ఉపయోగించి విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకునే ప్రయత్నం చేశాడు కానీ, వర్కవుట్ కాలేదు.
మళ్లీ ఓటీటీ బిగ్‌బాస్‌లో సైతం అఖిల్ సార్ధక్ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్స్‌గా వున్నాడు. బిందు మాధవి, అఖిల్ సార్ధక్ మధ్య వార్ ఒకింత గట్టిగానే నడుస్తోంది. టైటిల్ ఫేవర్ కంటెస్టెంట్లుగా వీరిద్దరినీ అభివర్ణిస్తున్నారు. అయితే, ఈ ఇద్దరూ ఇంతలా ట్రెండింగ్ అవడానికి ఎంత మొత్తంలో ఖర్చు చేసి వుంటారా.? అనేదే ఇప్పుడు నెట్టింటి చర్చ.
నో డౌట్.. ఇదేమీ ఆషా మాషీగా వచ్చే ఫాలోయింగ్ కానే కాదు. ఖచ్చితంగా పోటా పోటీగా ఖర్చు చేసే వుంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైతేనేం, బిగ్‌బాస్ రియాల్టీ షోకీ, ఆ షో టైటిల్ విన్నర్‌కీ వున్న కిక్కు వేరే లేవల్. ఆ కిక్కు దక్కించుకోవాలంటే ఆ రేంజ్‌లో పైసల్ పెట్టాల్సిందే.! ఎంత.? అని లెక్కేయలేం కానీ, బిందు మాధవి కూడా అదే చేసినట్లుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







