యూఏఈ ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా కన్నుమూత

- May 13, 2022 , by Maagulf
యూఏఈ ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా కన్నుమూత

అబుధాబి: యూఏఈ ప్రెసిడెంట్‌ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి చెందారు. ఈ మేరకు అధ్యక్షవ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ నవంబర్‌ 3, 2004 నుంచి యూఏఈ అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి షేక్‌ జాయెద్‌ మృతి తదుపరి షేక్ ఖలీఫా యుఏఏఏఏ అధ్యక్షా పదవి చేపట్టారు. 1948లో జన్మించిన షేక్ ఖలీఫా యూఏఈ రెండో అధ్యక్షుడిగా, అబుధాబి ఎమిరేట్‌ 16వ పాలకుడు.

షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాలనలో యూఏఈ వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించారు. అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత పౌరుల శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ధిని సాధించింది. నార్తర్న్ ఎమిరేట్స్ అవసరాలను అధ్యయనం చేయడానికి యూఏఈ అంతటా విస్తృతంగా పర్యటించడంతో పాటు గృహ నిర్మాణం, విద్య, సామాజిక సేవలకు సంబంధించి అనేక ప్రాజెక్టులకు సంబంధించి సూచనలు చేశారు. ఫెడరల్‌ నేషన్‌ కౌన్సిల్‌ సభ్యుల కోసం నామినేషన్‌ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు చొరవ చూపారు.

40 రోజులపాటు సంతాప దినాలు..
యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించినందుకు అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. జాతీయ జెండాలను సగం వరకు అవగతనం చేయడంతోపాటు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సమాఖ్య, స్థానిక సంస్థలను నేటి నుండి మూడు రోజులపాటు మూసివేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com