చిన్న సినిమాకి పవర్: పవన్ కళ్యాణ్ లెక్కే ఇది
- May 13, 2022
రీ ఎంట్రీలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలన్నీరీమేకులే.. అనే విమర్శ ఓ పక్క వున్నా, ఆ రీమేక్ సినిమాలతోనే తన పవరేంటో చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. విమర్శలు ఎలా వున్నా, పవన్ ఖాతాలో మరో రీమేక్ మూవీ తాజాగా యాడ్ అయిన సంగతి తెలిసిందే.
తమిళ సూపర్ హిట్ మూవీ అయిన ‘వినోదయసితం’ను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేస్తున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రచారానికి చెక్ పెడుతూ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా కన్‌ఫామ్ అయిపోయిందిప్పుడు.
కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ అయిన సముద్రఖని ప్రధాన పాత్రలో వచ్చిన ‘వినోదయసితం’ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకి సముద్రఖని దర్శకుడు కూడా. ఇదే సినిమాని, పవన్ కళ్యాణ్ హీరోగా సముద్రఖని డైరెక్ట్ చేయబోతున్నారు.
పవన్ ఇంతవరకూ రీమేక్ చేసిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు ఆయా భాషల్లో చాలా చాలా తక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమాలుగా రూపొందాయి. తెలుగులోనూ బడ్జెట్ విషయంలో తక్కువ ఖర్చే అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ పవర్‌తో ఈ సినిమాలు భారీ వసూళ్లు కొల్లగొట్టాయ్.
ఇప్పుడు తాజా సినిమా ‘వినోదయసితం’ కూడా అంతే. తమిళంలో చాలా చిన్న బడ్జెట్‌తో రూపొందింది. తెలుగులో ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో వంద కోట్ల సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు. తనకున్న పొలిటికల్ కమిట్‌మెంట్స్‌తో పవన్ కళ్యాణ్ స్ర్టెయిట్ తెలుగు సినిమాలు చేయలేకపోతున్నాడు. కానీ, రీమేకుల పేరు చెప్పి మంచి కథలని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ పవర్‌తో అవి కోట్లు కొల్లగొట్టేస్తున్నాయ్. భారీ సినిమాల లిస్టులోకి చేరిపోతున్నాయ్. దటీజ్ ది ‘పవర్’ ఆఫ్ పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







