బర్త్‌డే స్పెషల్: సన్నీలియోన్ అందుకే అంత ఇన్సిప్రేషన్.!
- May 13, 2022
పోర్న్ స్టార్‌గా పరిచయమై, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా, ఐటెం గాళ్‌గా సక్సెస్ అయిన ముద్దుగుమ్మ సన్నీలియోని. సన్నీలియోని.. ఆ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టేస్తుంటుంది. అదో రకమైన వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్ కారణంగానే సోషల్ మీడియాలోనూ సన్నీలియోన్ ఓ సెన్సేషన్.
బాలీవుడ్‌లోనే కాదు, సన్నీ ప్రకంపనలు ఇటు సౌత్ సినిమాకీ పాకాయ్. కొన్ని నిముషాల పాటు సన్నీలియోన్ సినిమాలో కనిపించిందంటే చాలు.. ఆ సినిమాకి బోలెడంత క్రేజ్. ఆ క్రేజ్‌కి తగ్గట్లుగానే ఆమె రెమ్యునరేషన్ కూడా వుంటుందనుకోండి.
సన్నీ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే కొన్ని సౌత్ సినిమాలు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తమ సినిమాలకు సరికొత్త గ్లామర్ హొయలు అద్దుతుంటారు. గతంలో మంచు మనోజ్ నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన సన్నీలియోన్, ఇప్పుడు మళ్లీ మంచు వారబ్బాయ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించేందుకు టాలీవుడ్‌కి వచ్చింది.
మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న సినిమాలో సన్నీలియోన్ నటిస్తోంది. ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ సన్నీలియోన్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు మరి. ఇక సినిమాల సంగతి అటుంచితే, సన్నీలియోన్ పర్సనల్ లైఫ్ కూడా ఆదర్శవంతమైనదే. ఓ ఆడపిల్లను దత్తత తీసుకుని పెంచుకుంది.
అలాగే సరోగసీ ద్వారా ఇద్దరు మగ పిల్లలకు తల్లి కూడా అయ్యింది. కమర్షియల్‌గా రకరకాల బిజినెస్‌లతో పాటు, అప్పుడప్పుడూ కొన్ని సేవా కార్యక్రమాల్లోనూ సన్నీలియోన్ చురుగ్గా పాల్గొంటుంది. అందుకే హీరోయిన్‌గా, ఐటెం గాళ్‌గా ముగ్గురు బిడ్డలకు తల్లిగా సన్నీలియోన్ జీవితం చాలా చాలా ఆదర్శవంతం. ఈ రోజు బర్త్‌డే జరుపుకుంటున్నహాట్ హాట్ సన్నీలియోన్‌కి బర్త్ డే విషెస్ చెప్పేద్దామా.. హ్యాపీ బర్త్‌డే టు సన్నీలియోన్.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







