షేక్ ఖలీఫా మరణంపై సంతాపం తెలిపిన రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్
- May 14, 2022
జెడ్డా: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ మరణంపై.. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి, అల్-నహ్యాన్ కుటుంబానికి, సోదర ఎమిరాటీ ప్రజలకు, అరబ్- ఇస్లామిక్ దేశాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ మరణ వార్త తెలిసిన వెంటనే కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ విచారంలో మునిగిపోయారని వారి కార్యాలయం తెలిపింది. తన ప్రజలకు, తన దేశానికి, ప్రపంచానికి చాలా అందించిన నాయకుడు షేక్ ఖలీఫా అంటూ తమ సందేశాల్లో వారు కొనియాడారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు క్రౌన్ ప్రిన్స్ ఫోన్ చేసి పరామర్శించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







