ఉత్తర కొరియాను వణికిస్తున్న జ్వరం..21 మంది మృతి
- May 14, 2022
ప్యాంగాంగ్: ఉత్తర కొరియాను జ్వరం వణికిస్తున్నది. ఏప్రిల్ చివరి వారం నుంచి దేశంలో జ్వర పీడితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఫీవర్‌తో గురువారం ఆరుగురు మరణించగా, వారిలో ఒకరికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 21 మంది జర్వానికి బలయ్యారు. కాగా, వీరి మరణానికి కారణం కరోనానా లేదా మరోటా అనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు. అయితే దేశంలో మొదటిసారిగా మే 12న తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఉత్తర కొరియాలో ప్రస్తుతం జ్వర పీడితుల సంఖ్య 2,80,810కి చేరింది. జర్వంతో ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మూడు దశల్లో విళయతాండం చేసినప్పటికీ కొరియాలో మాత్రం ఒక్క కేసూ నమోదవలేదు. అయితే తాజా పాజివ్ కేసులు వెలుగు చూస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడంతోపాటు లాక్‌డౌన్ ప్రకటించారు. గతంలో కరోనాను అడ్డుకోవడానికి వ్యాక్సిన్లను అందిస్తామని డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించాయి. అయితే కిమ్ దానికి ఒప్పుకోలేదు. ఉత్తర కొరియా ప్రజలు ధైర్యంగా కరోనాను ఎదుర్కొంటారని చెప్పారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







