సింగపూర్ లో అత్యంత వైభవోపేతంగా వాసవి మాత జయంతి వేడుకలు
- May 15, 2022
సింగపూర్: సింగపూర్ లో నివసిస్తున్న ఆర్యవైశ్యులు అందరు కలిసి వాసవి క్లబ్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో స్థానిక మారియమ్మన్ ఆలయంనందు అమ్మవారి విశేష అభిషేకము, కన్యపిల్లలకి విశేషంగా కన్యపూజలు, సామూహిక కుంకుమార్చన తదుపరి అమ్మవారి రథోత్సవం భక్తుల జయజయ ద్వానాల మధ్య కనులపండుగలా సాగింది.
కార్యక్రమానికి విశేష అతిధులుగా హాజరైన ఆలయ చైర్మన్ కదిరీషన్ మరియు ఆలయ ఉప ఛైర్మెన్ శ్రీనివాస్ కి అదేవిధంగా అక్కడి వైశ్యులకు అన్ని ధర్మసంబంధ విషయాల్లో మెళుకులవలు చెబుతూ కలిసిపోయే కృష్ణ శర్మ కి వాసవి క్లబ్ వ్యవస్థాపకులు వెంకట నాగరాజ్ కైలా మరియు పూర్వ సెక్రటరీ శ్రీధర్ చే సన్మానం నిర్వహించడం జరిగింది.
వాసవి క్లబ్ ప్రస్తుత అధ్యక్షులైన అరుణ్ కుమార్ గొట్లూరు మాట్లాడుతూ కోవిడ్ పరిస్థితుల తరువాత గత రెండు సంవత్సరాలుగా కార్యక్రమాలన్నీ జూమ్ పద్దతిలో జరుపుకొని మళ్ళీ సభ్యులందరి మధ్య ప్రత్యక్షంగా జరుపుకోవడం చాల ఆనందంగా ఉందని తెలియజేసారు. కార్యక్రమం మొదటినుంచి సమన్వయము చేసుకొంటూ వచ్చిన వాసవి క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ సింగపూర్ నందు వాసవి క్లబ్ వారు గత పది సంవత్సరములందు చేసిన అమ్మవారి విశేష పూజ కార్యక్రమ వివరాలు, సేవా కార్యక్రమాలు మరియు మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాల గురించి వివరించడము జరిగింది, అలాగే మారియమ్మన్ ఆలయ జీర్ణోద్ధరణలో వైశ్యులు విరివిగా పాల్గొనాలని, వైశ్యులు ఎప్పుడు మన ధర్మాన్ని విడనాడకుండా మరెన్నో సేవాకార్యక్రమాల్లో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమము ముందుకెళ్లడానికి విశేషంగా కృషి చేసిన వాసవి క్లబ్ కమిటీ సభ్యులైన ముక్కా కిషోర్, రాజా విశ్వనాథుల, మకేష్ భూపతి, మురళి పబ్బతి లకు ఆలయ ప్రధాన అర్చకులతో ప్రత్యేక ఆశీర్వచనములు అందజేశారు. 200 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమానికి తోడుగా నిలిచి ముందుకొచ్చిన సభ్యులు శివాజీ, కిషోర్, వినయ్, శివ, నరేష్, ఫణీష్, వినోదన్ లకు అతిదులందరు పేరు పేరున కృతజ్ఞలతో చక్కటి భోజన సదుపాయాలతో కార్యక్రమాన్ని ముగించారు.




తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







