దివంగత యూఏఈ అధ్యక్షుడికి నివాళులు అర్పించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- May 15, 2022
హైదరాబాద్: రెండ్రోజుల క్రితం కన్నుమూసిన యూఏఈ అధ్యక్షుడు, అబుధాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ సహ్యాన్ మృతిపట్ల భారత ప్రభుత్వం తరఫున అధికారికంగా సంతాపం తెలియజేసేందుకు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అబుధాబి బయలుదేరారు.
యూఏఈలో ఈరోజు సాయంత్రం దివంగత యూఏఈ అధ్యక్షుడి స్మృతికి నివాళులు అర్పిస్తారు. అనంతరం యూఏఈ తదుపరి అధ్యక్షుడిగా నియమితులైన షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తోపాటు దివంగత అధ్యక్షుడి ఇతర కుటుంబ సభ్యులను ఉపరాష్ట్రపతి పరామర్శిస్తారు. భారత ప్రభుత్వం తరఫున వారికి సానుభూతిని తెలియజేస్తారు.
నాలుగు రోజుల పర్యటనకోసం ఉపరాష్ట్రపతి హైదరాబాద్ కు వచ్చిన సంగతి విదితమే.అయితే యూఏఈ అధ్యక్షుడి మృతి నేపథ్యంలో భారతదేశం తరఫున నివాళులు అర్పించేందుకు ఉపరాష్ట్రపతి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో యూఏఈకి బయలుదేరారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







