కీర్తి సురేష్ పెదాలకు ఏమైంది.? కోత పడిందెందుకు.?
- May 16, 2022
రంగుల ప్రపంచంలో మెరిసిపోవాలంటే, కొన్ని కోతలు తప్పవు. అదేనండీ సర్జరీలు తప్పవు. ఇదేం కొత్త ముచ్చట కాదు. ఎప్పటి నుంచో వస్తున్నదే. అప్పట్లో అతిలోక సుందరి శ్రీదేవికే తప్పలేదు సర్జరీల తంటా. శ్రీదేవి మాత్రమే కాదు, నేటి జనరేషన్ అయిన ఆమె తనయ జాన్వీ కపూర్ కూడా సర్జరీల బాట పట్టక తప్పలేదు.
రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియాంకా చోప్రా, శృతిహాసన్.. ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు రకరకాలా కాస్మోటిక్ సర్జరీలకు వెళ్లిన వ్యవహారాలు తెలిసినవే. అయితే, ఇప్పుడీ సర్జరీల గొడవ ఎందుకంటారా.? ‘మహానటి’ కీర్తి సురేష్ కూడా ఈ తరహా బ్యూటీ సర్జరీ చేయించుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.
కీర్తి సురేష్ గత సినిమాల్లో కన్నా, తాజా సినిమా ‘సర్కారు వారి పాట’లో ఆమె పెదాలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయని అభిమానులు గుర్తించారు. నిజమే, కీర్తి సురేష్‌కి మూతి విషయంలో ఒకింత లోపాలున్న మాట వాస్తవమే.
కీర్తి సురేష్ మహానటి. అందులో నో డౌట్. అయితే, కొన్ని ఎలివేషన్ సీన్లలో ఆమె పెదాలు కాస్త అభ్యంతరకరంగా కనిపిస్తుండడంతో సర్జరీని ప్రపోజ్ చేశారట మేకర్లు. దాంతో ఆమె సర్జరీ చేయించుకోక తప్పలేదని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవమెంతో తెలీదనుకోండి.
అయితే ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ అంతకు మించిన అందంతో కనిపించిన మాట అక్షరాలా వాస్తవం. ‘కళావతి’ పాటలో క్లాసీ లుక్స్ అదరగొట్టేస్తే, ‘మ మ మహేషా..’ పాటలో మాస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పిచ్చెక్కించేసిందంతే.!
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







