హిందీ భాష గురించి కమలహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- May 17, 2022
చెన్నై: దేశంలో హిందీ భాషను రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందీ భాష గురించి ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కొత్త సినిమా విక్రమ్ కు సంబంధించిన ప్రచార కార్యక్రమం చెన్నైలో నిర్వహించగా అందులో పాల్గొన్న కమల్ మాట్లాడుతూ… తన మాతృ భాషకు ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటానని, దీనికి రాజకీయాలతో సంబంధం ఏమీ లేదని చెప్పారు.
తాను హిందీకి వ్యతిరేకిని కాదని అన్నారు. తన మాతృ భాష తమిళం అని, ఆ భాష వర్థిల్లాలని చెప్పడం తన బాధ్యత అని తెలిపారు. మాతృ భాషను ఎవరూ మరవకూడదని ఆయన చెప్పారు. కాగా, సినిమా, రాజకీయం కవలపిల్లలని, తాను ఈ రెండింట్లోనూ ఉన్నానని గుర్తు చేశారు. గుజరాతీ, చైనీస్ భాషలు కూడా నేర్చుకుని, మాట్లాడవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







