ఫైనల్ స్టేజ్‌కి చేరుకున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్: గెలుపెవరిదంటే.!
- May 18, 2022
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి వున్న క్రేజ్ వేరే లెవల్. బాగున్నా, బాగోలేకపోయినా, తిట్టుకున్నా, తిట్టుకోకపోయయినా.. అదేంటో బిగ్‌బాస్ షోని ఆడియన్స్ చూసేస్తూ వుంటారు. అందుకేనేమో అంత క్రేజ్ ఈ షోకి. అయితే, ఈ సారి బిగ్ బాస్ సీజన్‌ని బుల్లితెరపై కాకుండా, ఓటీటీ తెరపై టెలికాస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఓటీటీ తెరపై రెగ్యులర్ ఆడియన్స్ కాస్త తక్కువే అయినా, ఓవరాల్‌గా షోకి వున్న క్రేజ్ అయితే అలాగే వుంది. ఇకపోతే, ఈ సారి బిగ్ సీజన్లో గత సీజన్లలో కంటెస్టెంట్లుగా వున్నవాళ్లు చాలా మందే పార్టిసిపెంట్లుగా హౌస్‌లో సందడి చేశారు. అషు రెడ్డి తదితర కొందరు ఎలిమినేట్ అయిపోగా, ఇంకా అరియానా, అఖిల్, బాబా భాస్కర్ లాంటి వాళ్లు ఇంకా హౌస్‌లో వున్నారు.
అయితే, ఈ సారి టైటిల్ ఫైట్ మాత్రం బిందు మాధవి, అఖిల్ మధ్య చాలా టఫ్ సిట్యువేషన్లో సాగుతోన్న సంగతి సోషల్ మీడియా ఆడియన్స్‌కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత సీజన్లో జస్ట్ చేతికి వచ్చేసిందనుకున్న టైమ్‌లో కప్పు మిస్ చేసుకున్న అఖిల్ ఈ సారి ఎలాగైనా కప్పు దక్కించుకోవాలన్న కసితో ఆడుతున్నాడు.
ఆట సంగతి ఎలా వున్నా, బయటి నుంచి సపోర్టర్స్‌ని పక్కాగా ప్లాన్ చేసుకుని లోపలికి వెళ్లాడు. ఇక అఖిల్‌కి హౌస్‌లోకి వెళ్లాకా బిందు మాధవి బలం ఏంటో తెలిసింది. బిందు మాధవి కూడా ఏం తక్కువ తినలేదు. పక్కా స్కెచ్‌తోనే లోపలికి వెళ్లిందనుకోండి. అయితే, ఆమె ఆటిట్యూడ్, ఆట తీరు చూసి, మరికొంతమంది జన్యూన్‌గానే బిందు మాధవిని ఇష్టపడడం మొదలుపెట్టారు. అది మెయిన్ అస్సెట్ అయ్యింది బిందు మాధవికి.
ఏది ఏమైతేనేం, మరి కొద్ది గంటల్ల్లోనే బిగ్‌బాస్ ఓటీటీ మేనియాకి తెర పడనుంది. విన్నర్ ఎవరో తేలిపోనుంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









