‘ఎఫ్ 3’ ప్రమోషన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా సైలెన్స్ ఎందుకంటే.!

- May 18, 2022 , by Maagulf
‘ఎఫ్ 3’ ప్రమోషన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా సైలెన్స్ ఎందుకంటే.!

'ఎఫ్ 3' సినిమాతో త్వరలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచింది. ఇద్దరు ముద్దుగుమ్మలతో డైరెక్టర్ అనిల్ రావిపూడి చేస్తున్నఇంటర్వ్యూల హంగామా అలా ఇలా లేదు. 

వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘ఎఫ్ 3’ మూవీలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే,  ఇద్దరు ముద్దుగుమ్మల్లో మెయిన్ అట్రాక్షన్ అవ్వాల్సింది తమన్నా. కానీ, తమన్నా ప్రమోషన్లలో అస్సలు కనిపించడం లేదు. తమన్నా ప్లేస్‌ని మరో ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ రీ ప్లేస్ చేస్తోంది.

సోనాల్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తమన్నా విషయానికి వచ్చేస్తే, ప్రస్తుతం తమన్నా కేన్స్ ఫెస్టివల్‌లో బిజీగా గడుపుతోంది. అందుకే ప్రమోషన్లకు హాజరు కాలేకపోతోందట. కేన్స్‌లో పాల్గొనే ఛాన్స్ రావడమనేది ఓ డ్రీమ్‌గా వుంటుంది ముద్దుగుమ్మలకి. ఆ డ్రీమ్ ఇప్పుడు మిల్కీ బ్యూటీకి నెరవేరబోతోంది.

అలాగే ‘ఎఫ్ 3’ మూవీ కూడా తన కెరీర్‌లో ఇంపార్టెంట్ మూవీగా చెప్పుకొచ్చింది తమన్నా. ‘ఎఫ్ 3’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ సినిమాలో తమన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే యంగ్ ఛామ్ సత్యదేవ్‌తో తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com