కేన్స్ ఫెస్టివల్ 2022లో..బ్లాక్ అండ్ వైట్ బాల్ గౌన్‌లో మెరిసిపోతున్న తమన్నా

- May 18, 2022 , by Maagulf
కేన్స్ ఫెస్టివల్ 2022లో..బ్లాక్ అండ్ వైట్ బాల్ గౌన్‌లో మెరిసిపోతున్న తమన్నా

బాహుబలి ఫేమ్, మిల్లీ బ్యూటీ తమన్నా భాటియా కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ 2022లో ఓ మెరుపు మెరిసింది. బ్లాక్ అండ్ వైట్ బాల్ గౌన్‌లో మిల్కీ బ్యూటీ..మరింతగా అందాలు చిందిస్తోంది. అందర్నీ ఔరా అన్పిస్తోంది.

ప్రపంచ ప్రసిద్ధ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ 2022లో బాహుబలి ఫేమ్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై బ్లాక్ అండ్ వైట్ బాల్ గౌన్‌లో అందాలు చిందించింది. అద్భుతమైన బాల్ గౌన్‌తో టాప్‌నాచ్ లుక్‌తో అందర్నీ ఆకర్షించింది. 

ఇదే కేన్స్ ఫెస్టివల్ 2022లో దీపికా పదుకోన్ సవ్యసాచి శారీ లుక్ డిజైన్ చేసిన షాలీనీ నథానీనే తమన్నా గౌన్ డిజైన్ చేసింది. కేన్స్ ఫెస్టివల్ 2022లో మలైకా అరోరా సహా చాలామంది ప్రేమను పొందాననే క్యాప్షన్‌తో తమన్నా బాల్ గౌన్ ఫోటోల్ని ఇన్‌‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తమన్నా ధరించిన బ్లాక్ అండ్ వైట్ బాల్ గౌన్‌ను హార్ట్ ఈమోజీలతో నటీమణులు దివా, నీహారిక కొణిదెల, రాశీఖన్నాలు బ్యూటిఫిల్, గాడ్జియస్ అంటూ ప్రశంసలు కురిపించారు.

కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ నేతృత్వంలో కేన్స్ ఫెస్టివల్ 2022లో పాల్గొన్న ప్రతినిధుల బృందంలో తమన్నా భాటియా ఓ సెలెబ్రిటీ. ఈమెతో పాటు నయనతార, పూజాహెగ్డే, ఆర్ మాధవన్, ఏఆర్ రెహమాన్, ననాజుద్దీన్ సిద్దీఖీలు కూడా పాల్గొన్నారు. మరోవైపు కోవిడ్ 19 సోకడంతో అక్షయ్ కుమార్ వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. దీపికా పదుకోన్, ఐశ్వర్యా రాయ్‌లు కూడా కేన్స్ ఫెస్టివల్ 2022లో ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నారు. దీపికా పదుకోన్ జ్యూరీ మెంబర్ కూడా. హీనా ఖాన్ కూడా ఈసారి కేన్స్ ఫెస్టివల్‌లో పాల్గొంటుంది. 

టాలీవుడ్ బిగ్గెస్ట్ కామెడీ సినిమాగా నిలిచిన ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3లో వెంకటేశ్ సరసన తమన్నా భాటియా కన్పించనుంది. ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించారు. మే 27న ఎఫ్ 3 సినిమా విడుదల కానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com