ఇండియాలోనూ శ్రీలంక పరిస్థితే: రాహుల్ గాంధీ
- May 18, 2022
న్యూ ఢిల్లీ: అనేక అంశాల్లో ఇండియాలోనూ శ్రీలంక వంటి పరిస్థితే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టి మళ్లించడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. వివిధ అంశాల్లో శ్రీలంకతో, ఇండియాను పోలుస్తూ రాహుల్ గాంధీ బుధవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, పెట్రోల్ ధరలు, మత హింస వంటి అంశాల్లో ఇండియా, శ్రీలంకను పోలి ఉందన్నారు. దీనికి సంబంధించిన గ్రాఫ్స్‌ను ఆయన ట్వీట్ చేశారు.
ప్రజల దృష్టి మరల్చడం ద్వారా వాస్తవాల్ని దాచలేరని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ పార్టీ, కొంతకాలంగా బీజేపీపై విమర్శలు చేస్తూనే ఉంది. శ్రీలంకలో పెరిగిన ధరలు, నిరుద్యోగం కారణంగా ఆ దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







