హైదరాబాద్ విమానాశ్రయానికి ACI ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్ గుర్తింపు

- May 18, 2022 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయానికి  ACI ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్ గుర్తింపు

హైదరాబాద్: GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నిషన్ 2022 కార్యక్రమంలో సిల్వర్ పురస్కారాన్ని గెలుచుకుంది. HYD అంతర్జాతీయ విమానాశ్రయం తన సమర్థవంతమైన ‘కార్బన్ మేనెజ్మెంట్‌’కు గాను ఆసియా - పసిఫిక్ ప్రాంతంలోని 15-50 మిలియన్ ప్రయాణికుల (MPPA) విభాగంలో ఈ అవార్డును గెలుచుకుంది. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2018 నుండి ఈ అవార్డును గెలుచుకోవడం ఇది వరుసగా 5వ సారి.

ACI గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ పర్యావరణంపై విమానయాన పరిశ్రమ ప్రభావాన్ని తగ్గించడానికి ఉత్తమ పర్యావరణ పద్ధతులను ప్రోత్సహిస్తుంది.ఇది అత్యుత్తమ పర్యావరణ కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపట్టే ఆసియా-పసిఫిక్ సభ్యులను గుర్తిస్తుంది. GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) సుస్థిర విమానాశ్రయ కార్యకలాపాల ద్వారా పర్యావరణ పరిరక్షణను తన ప్రధాన నిర్వహణ సూత్రంగా స్వీకరించి ఆ దిశగా పని చేస్తోంది.

ICAO (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) యొక్క పర్యావరణ లక్ష్యం ‘‘ప్రపంచ పర్యావరణంపై విమానయాన పరిశ్రమ యొక్క గ్రీన్ హౌజ్ గ్యాస్ ఎమిషన్స్ (GHG) ప్రబావాన్ని తగ్గించడం లేదా నియంత్రించడం’’ అనే దిశగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ క్రింది కార్యక్రమాలు చేపడుతోంది:

·         హరిత భవనాలు

·         పునరుత్పాదక శక్తి వినియోగం

·         విద్యుచ్ఛక్తి ఆదా

·         ఎకో-ఫ్రెండ్లీ రిఫ్రిజిరెంట్ల వినియోగం, ఇంధన పరిరక్షణ 

·         విమానాశ్రయ కార్యకలాపాలలో ఇంధన, విద్యుత్ పరిరక్షణ

·         కర్బన ఉద్గారాల పరిహరణ కోసం గ్రీన్ బెల్ట్ అభివృద్ధి  

·         గ్రీన్ హౌజ్ గ్యాస్ (GHG) ఎమిషన్స్ నిర్వహణ, కార్బన్ న్యూట్రాలిటీ

ఈ సందర్భంగా GHIAL CEO ప్రదీప్ పణికర్, “పర్యావరణ పరిరక్షణ మా బిజినెస్‌లో అంతర్భాగంగా ఉంటూ వస్తోంది. విమానాశ్రయ పర్యావరణ వ్యవస్థలో ఇంధన సంరక్షణ పద్ధతులను అవలంబించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మేం కట్టుబడి ఉన్నాము. అనేక ఏళ్లుగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సుస్థిర వనరులు, పర్యావరణ అనుకూల విధానాలు, ఇంధన-సమర్థవంతమైన పరికరాలు, పర్యావరణ అనుకూల సాంకేతికత, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం ద్వారా హరిత విధానాలను పాటిస్తోంది. ఈ ప్రయాణంలో మేం సుస్థిర విమాన ఇంధనం కోసం అధ్యయనం కూడా చేస్తున్నాము. ఎసిఐ - ఆసియా పసిఫిక్ ఎన్విరాన్‌మెంట్ కమిటీ నుంచి ఈ గుర్తింపును పొందడం ఎంతో హర్షదాయకం. ఇది మా పర్యావరణ అనుకూల కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేలా మమ్మల్ని పురిగొల్పుతుంది’’ అన్నారు.

GHIAL కార్బన్ మేనెజ్మెంట్ విధానాలు ఐక్యరాజ్య సమితి యొక్క సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ 13కు సమాంతరంగా ఉన్నాయి. ఇవి వాతావరణ మార్పు మరియు దాని ప్రభావాలను ఎదుర్కోవడానికి తక్షణ చర్యలను తప్పనిసరి చేస్తాయి.

ACI 'ఎయిర్‌పోర్ట్ కార్బన్ అక్రిడిటేషన్' ప్రోగ్రామ్‌ను స్వీకరించి, GHIAL తన విభాగంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కార్బన్ న్యూట్రల్ స్థాయి 3+ హోదాను సాధించిన మొదటి విమానాశ్రయంగా అవతరించింది. ఈ క్రమంలో, GHIAL 'నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్‌పోర్ట్'గా మారే దిశగా కృషి చేస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com