సూపర్‌నోవా ఫిన్‌టెక్ ఛాలెంజెస్ 2022ని ప్రారంభించిన సీబీబీ

- May 19, 2022 , by Maagulf
సూపర్‌నోవా ఫిన్‌టెక్ ఛాలెంజెస్ 2022ని ప్రారంభించిన సీబీబీ

బహ్రెయిన్ : దేశవ్యాప్త ఫిన్‌టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ల రెండవ వార్షిక సిరీస్‌ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ (CBB)  ప్రారంభించింది. బహ్రెయిన్ ఓపెన్ బ్యాంకింగ్ సూపర్‌నోవా 2022గా పిలవబడే దీన్ని ఫిన్ హబ్(FinHub 973), సీబీబీ డిజిటల్ ల్యాబ్, ఓపెన్ ఇన్నోవేషన్ సంస్థ ఫిన్ టెక్ గెలాక్సి(Fintech Galaxy) లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. బహ్రెయిన్ రాజ్యంలో ఫిన్‌టెక్ సెక్టార్ అభివృద్ధిని మరింతగా పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఓపెన్ ఏపీఐ(API)లను ఉపయోగించే ఆర్థిక సంస్థలు, స్టార్టప్‌ల మధ్య సహకారాన్ని, ఏకీకరణను పెంచడానికి సీబీబీ డిజిటల్ వ్యూహానికి అనుగుణంగా ఫిన్‌టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ని దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com