ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ

- May 21, 2022 , by Maagulf
ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ

ఖతార్: ఫిఫా(FIFA) వరల్డ్ కప్ ఖతార్ 2022 అధికారిక మస్కట్ అయిన ‘లాయీబ్’ అధికారిక స్టాంపును ఆవిష్కరించారు. 3-2-1 ఖతార్ ఒలింపిక్, స్పోర్ట్స్ మ్యూజియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఖతార్ పోస్ట్ దీన్ని లాంచ్ చేసింది. ఈ ఏడాది టోర్నమెంట్‌కు అధికారిక మస్కట్‌గా ప్రపంచ కప్ డ్రా సందర్భంగా లయీబ్ అయిన సాంప్రదాయ ఖతారీ 'ఘుత్రా'ను  ఆవిష్కరించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం ఖతార్ పోస్ట్ ప్రత్యేక స్టాంపుల ప్రొవైడర్‌గా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్ (FIFA)తో ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత FIFA క్లాసిక్స్ కలెక్షన్ స్టాంపులను ప్రారంభించింది. అంతకు ముందు ఇది టోర్నమెంట్ కోసం ఖతార్ మ్యాప్ రూపంలో అధికారిక టోర్నమెంట్ లోగోతో పాటు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టేడియాల రూపంలో అధికారిక పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేసింది. FIFA క్లాసిక్స్ లో దక్షిణాఫ్రికా (2010), బ్రెజిల్ (2014),  రష్యా (2018) నుండి గత మూడు FIFA ప్రపంచ కప్ టోర్నమెంట్‌ల చరిత్రను తెలిపేలా రూపొందించారు. ఈ సందర్భంగా ఖతార్ పోస్ట్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ హమద్ అల్ ఫాహిదా మాట్లాడుతూ.. FIFA వరల్డ్ కప్ 2022 కోసం ఖతార్ సన్నాహాలను డాక్యుమెంట్ చేయడానికి మా ప్రయాణం కొనసాగుతుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com