మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- May 21, 2022
బహ్రెయిన్: మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు ఓ మహిళ విడాకులు పొందింది. మద్యపానానికి బానిసైన భర్త నుంచి విడాకులు మంజూరు చేయాలంటూ ఒక మహిళ చేసిన అభ్యర్థనను బహ్రెయిన్‌లోని షరియత్ కోర్టు ఆమోదించింది. మహిళ భర్త బాగా తాగుబోతుగా మారి ఆమెను, వారి పిల్లలను ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేశాడని, నిత్యం దుర్భాషలాడే వాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. భర్తతో కలిసి జీవితాన్ని కొనసాగించేందుకు మహిళ చాలా కష్టాలు ఎదుర్కొందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనేక మంది సాక్షులు ఆమెకు అనుకూలంగా సాక్ష్యమిచ్చారు. దీంతో అన్ని విషయాలను కూలంకుషంగా పరిశీలించిన కోర్టు.. 35 ఏళ్ల వారి వివాహ బంధం నుంచి సదరు మహిళకు విడాకులు మంజూరు చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు