పవన్ కళ్యాణ్ సినిమా పై ఆ రూమర్లు నిజమేనా.?

- May 21, 2022 , by Maagulf
పవన్ కళ్యాణ్ సినిమా పై ఆ రూమర్లు నిజమేనా.?

‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా అరడజనుకు పైగా సినిమాలు ఓకే చేసేశారు. అందులో కొన్ని రీమేకులూ వున్నాయ్. ప్రస్తుతం ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు. క్రిష్ ఈ సినిమాకి దర్శకుడు. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్‌గా రూపొందుతోంది ఈ సినిమా.

 ఈ సినిమా టైమ్‌లోనే ఇంకో సినిమానీ పవన్ కళ్యాణ్ పట్టాలెక్కిస్తారని అనుకున్నారంతా. అదే ‘భవదీయుడు భగత్‌సింగ్’. హరీష్ శంకర్ దర్శకుడు. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు షికార్లు చేశాయ్. అలాంటిదేమీ లేదు. ఆగస్టులో ఈ సినిమా పట్టాలెక్కనుందని మేకర్ల ద్వారా అందుతోన్న తాజా సమాచారం.
 
మైత్రీ మూవీస్ బ్యానర్‌లో రూపొందబోయే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తాజాగా తన కాల్షీట్లు ఇచ్చేశారట. త్వరలోనే పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛ్ అయిపోనుందట. ఆ వెంటనే ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.

కాగా, ఈ సినిమా లైన్‌లోకి వచ్చేసరికి, పవన్ చేయాల్సిన ఇంకో సినిమా ‘వినోదయసితం’ ఆగిపోయిందంటూ కొత్తగా రూమర్లు తెరపైకొచ్చాయి. సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా సూపర్ హిట్ తమిళ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. రీమేక్ మూవీ కావడంతో చాలా కొద్ది రోజుల్లోనే ఈ సినిమాని పూర్తి చేయగలిగే ఫ్లెక్సిబిలిటీ వుంటుంది.
 
సో, అన్ని రూమర్లకు చెక్ పెట్టేలా ఓ పక్క ‘భవదీయుడు..’ మరో పక్క ‘వినోదయసితం’ సమాంతరంగా కంప్లీట్ చేసే యోచనలో పవన్ కళ్యాణ్ వున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com