ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీ బిజీ

- May 21, 2022 , by Maagulf
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీ బిజీ

న్యూ ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ మోతీబాగ్‌లోని సర్వోదయ సీనియర్ సెకండరీ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను పరిశీలించారు. అక్కడి విద్యా విధానం గురించి అరవింద్ కేజ్రీవాల్ ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సర్వోదయ పాఠశాల డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్‌ తిలకించారు. పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం సీఎం బృందం పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించింది.

కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆప్ ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ, పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు కేజ్రీవాల్. స్కూల్ సందర్శన తర్వాత మహమ్మద్‌పూర్‌లోని మోహల్లా క్లినిక్‌ను కేసీఆర్ సందర్శించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం మోహల్లా క్లినిక్స్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది.

ఇక, శనివారం మధ్యాహ్నం సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు.దాదాపు రెండున్నర గంటల పాటు ఇద్దరు నేతలు జాతీయ అంశాలతో పాటు ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com