జురెక్ చేరుకున్న ఏపీ సీఎం జగన్
- May 21, 2022
జురెక్: వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్.జగన్ దావోస్ చేరుకుంటున్నారు.స్విట్జర్లాండ్‌లోని జురెక్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో దావోస్ ప్రయాణమయ్యారు. మరికాసేపట్లో ఆయన దావోస్ చేరుకుంటారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్ కార్యదర్శి ఆరోఖ్యరాజ్ సీఎంకు సాదర స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ రెండో కార్యదర్శి రాజీవ్‌కుమార్, ఎంబసీలో మరొక రెండవ కార్యదర్శి బిజు జోసెఫ్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తెలుగువారు కూడా సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







