సూర్య ప్రతాప్ తో శర్వానంద్..
- April 07, 2016
రన్ రాజా రన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన శర్వానంద్, వరుసగా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతోనూ అదే జోరు కొనసాగించాడు. ఎక్స్ ప్రెస్ రాజా సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో, ప్రస్తుతం తన తదుపరి సినిమా మీద దృష్టిపెట్టాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్న శర్వా, నెక్ట్స్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా యువనటుడు రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన బోల్డ్ ఎంటర్ టైనర్ కుమారి 21ఎఫ్. కథా కథనాలు సుకుమార్ అందించినా.. తనదైన టేకింగ్ తో సినిమాను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించిన దర్శకుడు పలనాటి సూర్యప్రతాప్ కు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన నెక్ట్స్ సినిమాను సూర్య ప్రతాప్ తో చేయాలనుకుంటున్నాడు శర్వానంద్. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







