రామ్‌గోపాల్‌వర్మ కంపెనీ నీ అమితాబ్ సందర్శించారు..
- April 07, 2016
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కంపెనీ అనే పేరుతో ఓ ఆఫీసును ఏర్పాటు చేశారు. దీన్ని బాలీవుడ్ షహెన్షా అమితాబ్ సందర్శించారు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. సర్కార్ తన ఆఫీసుకు రావడం అద్భుతమైన క్షణమని ట్వీట్ చేశారు. దీంతోపాటు అమితాబ్ ఆఫీసుకు వచ్చినప్పుడు తీసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కంపెనీ లోపలికి వచ్చిన అమితాబ్‌కు వర్మ స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రతి గది తిరుగుతూ మొత్తం ఆఫీసును చూపించారు.
రామ్‌గోపాల్‌వర్మ ఇవాళ తన పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ దర్శకులు పూరీ జగన్నాథ్, కోనా వెంకట్, సుధీర్ వర్మ, నటుడు బ్రహ్మాజీ తదితరులు సోషల్‌మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వర్మ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







